Evolutyz: మరో రెండేళ్లలో రూ.650 కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఎవల్యూటిజ్ కంపెనీ అడుగులు
Vizag Evolutyz Campany: గత రెండేళ్లలో 140 శాతం వృద్ధిని సాధించిన ఎవల్యూటిజ్ కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరంలో రెండు అంకెల వృద్ధిని సాధించినట్లు పేర్కొంది. రాబోయే రోజుల్లోనూ ఇదే ఊపును కొనసాగించాలని కంపెనీ భావిస్తోంది.
Vizag Evolutyz Campany: ఈ ఏడాదిలో రెండెంకెల వృద్ధిని సాధించినట్లు ఐటీ ఆధారిత సేవలు, ఐటీ ఉత్పత్తుల కంపెనీ ఎవల్యూటిజ్ వెల్లడించింది. విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ.. ప్రస్తుతం మన దేశంలో 650 మంది నిపుణులతో బలమైన శ్రామికశక్తిని కలిగి ఉంది. వీరిలో 500 మంది విశాఖపట్నం, హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. అదనంగా 150 మంది గ్లోబల్ లొకేషన్‌లలో పనిచేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఇతర డీప్ టెక్ ప్లాట్‌ఫారమ్‌లపై అధునాతన ఉత్పత్తులు, ప్లాట్‌ఫారమ్‌లను నిర్మిస్తున్న ఈ కంపెనీ.. తన కార్యాచరణ స్థాయి, సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని ప్రదర్శించింది. వివిధ సంస్థలకు హామీ ఇచ్చిన బిజినెస్ రిజల్ట్, కస్టమర్ సేవలు, డిజిటల్ సేవలను ఎవల్యూటిజ్ అందిస్తోంది.
2011లో చికాగోలో ప్రధాన కార్యాలయంగా ఐటీ కన్సల్టింగ్ కంపెనీ యువ భారతీయ టెక్కీలు ఎవల్యూటిజ్ కార్ప్‌ను స్థాపించారు. మన దేశంలో తొలిసారి అక్టోబర్ 2016లో విశాఖపట్నంలో ఈ కంపెనీ కార్యకలపాలు ప్రారంభమయ్యాయి. తరువాత హైదరాబాద్, నోయిడా, బెంగుళూరు, పూణేలో ఒక డెవలప్‌మెంట్ సెంటర్‌గా తన కార్యాలయాలను విస్తరించింది. గోవాలో కొత్త ఆఫీస్ స్పేస్‌తో కంపెనీ తన వృద్ధిని, రిక్రూట్‌మెంట్‌ను వేగవంతం చేసింది.
గత 24 నెలల్లోనే ఎవల్యూటిజ్ కంపెనీ 140 శాతం వృద్ధిని సాధించింది. రాబోయే రోజుల్లోనూ ఇదే ఊపును కొనసాగించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని రూ.430 కోట్ల నుంచి వచ్చే 24 నెలల్లో రూ.650 కోట్లకు అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 10 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఎవల్యూటిజ్ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస అరసాడ మాట్లాడుతూ.. తమ స్థిరమైన వృద్ధి అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను అందిస్తూ.. కస్టమర్ సంతృప్తిపైనే దృష్టి పెట్టామన్నారు. తమ సిబ్బంది బృందం సాధించిన విజయాల పట్ల తాము గర్విస్తున్నామన్నారు.
భవిష్యత్‌లో ఆవిష్కరణలను కొనసాగిస్తామన్నారు. తమ వృద్ధి కేవలం సంఖ్యలో మాత్రమే కాదని.. సాంకేతికత అడాప్షన్, ఇన్నోవేషన్ పరంగా తాము ఎలా ఎదుగుతున్నామనేది ఎప్పటికప్పుడు చూస్తుంటున్నామన్నారు. రీసర్చ్, అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం తమ వ్యూహానికి కీలకం అని అన్నారు. తాము సక్రమార్గంలో ముందంజలో ఉన్నామని.. తమ క్లయింట్‌లకు పరిష్కారాలను అందించడం కొనసాగిస్తామని శ్రీనివాస అరసాడ తెలిపారు.
Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook