Facebook Will Close Two Features: ఫేస్‌బుక్‌ వినియోగదారులకు మీటా బ్యాడ్ న్యూస్ చెప్పింది. రెండు ఫీచర్లను త్వరలో తోలగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లొకేషన్ ఆధారిత ఫీచర్,  వాతావరణ హెచ్చరికల సంబంధించిన ఫీచర్లను తోలగిస్తున్నట్లు మీటా ఓ ప్రకటనలో పేర్కొంది. 31 మే తర్వాత నుంచి ఈ రెండు ఫీచర్లు పనిచేయడం ఆగిపోతాయని ఫేస్‌బుక్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మీరు ఇప్పుడు ఏమి చేస్తారు:
వాస్తవానికి ఈ ఫీచర్ మే 31 వరకు మాత్రమే అమలులో ఉంటుందని..అయితే వినియోగదారులు తమ లొకేషన్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి తగినంత సమయం ఇస్తామని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. మీరు లొకేషన్ హిస్టరీని స్నేహితుడితో కూడా షేర్ చేయోచ్చని పేర్కొంది. దీనిని ఆగస్టు 1 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 1 తర్వాత సర్వర్ సంబంధించిన మొత్తం డేటా తొలగిపోతుందని వెల్లడించింది.  అయితే మీరు దీన్ని ఆగస్టు 1 లోపు డౌన్‌లోడ్ చేసుకోవడం మేలని సూచించింది.


ఫేస్‌బుక్ లొకేషన్ హిస్టరీ:


ఫేస్‌బుక్ వినియోగదారుల లొకేషన్ హిస్టరీ ఫీచర్‌ను నిపివేయడం వల్ల మీ నుంచి లొకేషన్ హిస్టరీ డేటాను సేకరించదని మీటా తెలిపింది. ఈ ఫీచర్‌ తోలగించడం ద్వారా వినియోగదారులకు కొన్ని లాభాలుంటాయని సంస్థ పేర్కొంది. అయితే ఆ లాభాల గురించి మాత్రం తెలిపలేదు.


ఇప్పటికే పలు సేవలు రద్దు:


ఇప్పటికే మెటా భారత్‌లో ఎక్స్‌ప్రెస్ వైఫై సేవల్ని నిలిపివేసింది. ఈ వైఫై ముఖ్య ఉద్దేశ్యం అతి తక్కువ ఖర్చుతో కేవలం 4 వందల రూపాయలకే 20 జీబీ ఇంటర్నెట్ అందించడం. అయితే దీనిని 2016లో ఫేస్‌బుక్ ఆరంభించింది.  ఈ ప్రాజెక్టు ద్వారా వ్యాపారంలో మంచి ఆదాయం పొందవచ్చని సంస్థ వెల్లడించింది.


Also Read: UPSC CSE Admit Card 2022: విడుదలైన UPSC సివిల్ సర్వీసెస్ అడ్మిట్ కార్డ్‌..ఈ లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి..!


Also Read: Driving License Rules: డ్రైవింగ్ లైసెన్స్ కొత్త నియమాలు, ఇక లైసెన్స్ మరింత సులభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook