Fact Check: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్-డీజిల్‌పై 6 వేల రూపాయల డిస్కౌంట్ ఇస్తోందనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త ఎంతవరకూ నిజమో కాదో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెట్రోల్-డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏకంగా 6 వేల రూపాయల డిస్కౌంట్ ఇస్తోందనే వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వార్త ఎంతవరకూ నిజం, దీనివెనుక నేపధ్యమేంటో తెలుసుకుందాం. ఏ విధంగా మీకు 6 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుందో చూద్దాం..


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే ఐవోసీఎల్ 6 వేల రూపాయల డిస్కౌంట్ లభించే అవకాశాన్ని కల్పిస్తోందనే వార్త గత కొద్దిరోజులుగా వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌లో తేలిన వివరాలు మరోలా ఉన్నాయి. వైరల్ అవుతున్న పోస్ట్‌పై పీఐబీ వివరణ ఇచ్చింది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో ఒక లక్కీ డ్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ్యక్తిగత వివరాలు సమర్పిస్తే 6 వేల రూపాయల ఇంధనం సబ్సిడీ కానుక గెల్చుకునే అవకాశముందనేది ఈ పోస్ట్ సారాంశం. అయితే ఈ లక్కీ డ్రా పూర్తిగా ఫేక్‌ అని..ఇదొక స్కామ్ అని జాగ్రత్తగా ఉండాలని పీఐబీ స్పష్టం చేసింది. ఈ పోస్ట్‌కు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు ఏ విధమైన సంబంధం లేదని తెలిపింది./p>



ఈ ఫ్యాక్ట్‌చెక్ తరువాత ఇలాంటి ఫేక్ మెస్సేజ్‌ల వలలో పడవద్దంటూ పీఐబీ అప్రమత్తం చేస్తోంది. ఇండియన్ ఆయిల్, బ్యాంక్ లేదా ఏదైనా ప్రభుత్వ పధకం కోసం ఎప్పుడూ వ్యక్తిగత వివరాలు అడగరని పీఐబీ స్పష్టం చేసింది. ఏ విధమైన ఆఫర్ లేదా స్కీమ్ గురించి అధికారిక వెబ్‌సైట్‌లో చూసిన తరువాతే నిర్ధారించుకోవాలని సూచిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెస్సేజ్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని పీఐబీ సూచిస్తోంది. ఇలాంటి మెస్సేజ్‌లు ఫార్వర్డ్ చేయవద్దని కూడా సూచించింది. 


Also read: IAA Leadership Awards: జీ సీఈవో, ఎండి పునీత్ గోయెంకాకు అంతర్జాతీయ గుర్తింపు, గేమ్ ఛేంజర్ అవార్డుతో సత్కారం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.