Family Pension Scheme : నేటికాలంలో ఏ కుటుంబానికైనా సరే ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు చాలా మంది ఉద్యోగులు పెన్షన్ ను ప్లాన్ చేసుకుంటుంటారు. పెన్షన్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత లభిస్తుందని భావిస్తారు. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఎవరిమీద ఆధారపడకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ఉద్యోగుల ఆర్ధిక భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పలు పెన్షన్ స్కీములను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఉద్యోగిసడెన్ గా మరణిస్తే కుటుంబ పరిస్థితి ఏంటి. వారి ఆర్ధిక భద్రతకు భరోసా ఎవరు అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఉద్యోగులు తమ కుటుంబం కసం ఫ్యామిలీ పెన్షన్ కోసం ప్లాన్ చేసుకోవాలి. అయితే ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏమిటి. దానికి ఎవరు అర్హులు. ఎలాంటి అర్హతలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏంటి? 


ఫ్యామిలీ పెన్షన్ అనేది వ్యవస్థిక్రుత రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చింది. పదవీ విరణమణకు ముందు ఉద్యోగులు సడెన్ గా మరణిస్తే..వారి ఫ్యామిలీకి ఇది ఆర్థిక సాయం అందిస్తుంది. ఉద్యోగులు తమ జీతంలో 12శాతాన్ని ఈపీఎఫ్ఓ అకౌంట్లో జమ చేస్తుంటారు. కంపెనీ యాజమాన్యం కూడా ప్రతినెలా కొంత మొత్తాన్ని ఉద్యోగి అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. ఇలా జమ అయిన డబ్బును ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రూపంలో పొందుతారు. అయితే ఉద్యోగి రిటైర్మెంట్ కు ముందు మరణిస్తే..అతని ఫ్యామిలీకి పెన్షన్ అందుతుంది. 


ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం..కనీసం 10ఏండ్ల పాటు  కంపెనీలో పనిచేసే ఉద్యోగి పెన్షన్ కు అర్హులవుతారు. ఆ తర్వాత ఉద్యోగి మరణిస్తే..అతని లేదా ఆమె ఫ్యామిలీ పెన్షన్ కు అర్హత పొందుతుంది. అయితే ఫ్యామిలీ పెన్షన్ అర్హత కోసం ఈపీఎఫ్ఓ కొన్ని నిబంధనలను విధించింది. అవేంటో చూద్దాం. 


Also Read: Explainer : వివాదాల్లో సెబీ చైర్ పర్సన్..మెట్టు దిగకుండా మొండి పట్టుదల ఎందుకు? రాజీనామా చేయాలంటూ వరుస డిమాండ్లు..!!


ఫ్యామిలీ పెన్షన్ కు ఎవరు అర్హులు? 


ఫ్యామిలీ పెన్షన్ కు మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి ప్రధాన లబ్దిదారు. ఉద్యోగి భార్యకు పెన్షన్ లో 50శాతం లభిస్తుంది. 25ఏండ్ల కంటే తక్కువ వయస్సుకన్న ఇద్దరు పిల్లలు ఉంటే వారికి చెరో 25శాతం పెన్షన్ అందుతుంది. ఉద్యోగి మరణించిన తర్వాత అతని జీవిత భాగస్వామి మళ్లీ పెళ్లి చేసుకుంటే..అప్పుడు ఉద్యోగి పిల్లలు 25ఏండ్లు వచ్చే వరకు 75శాతం పెన్షన్ పొందుతారు. శారీరక వైకల్యం ఉద్యోగి పిల్లలు జీవితాంతం 75శాతం పెన్షన్ తీసుకుంటారు. 


Also Read: Home Loan Interest Rates: హోమ్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook