Explainer : వివాదాల్లో సెబీ చైర్ పర్సన్..మెట్టు దిగకుండా మొండి పట్టుదల ఎందుకు? రాజీనామా చేయాలంటూ వరుస డిమాండ్లు..!!

 SEBI chief Madhabi Buch: హిండెన్ బర్గ్ రిపోర్ట్ అనంతరం సెబీ చైర్ పర్సన్ పైనే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె నైతిక బాధ్య వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్లు సైతం వస్తున్నాయి. ఇదిలా ఉంటే అసలు ఈ కేసులో జరుగుతున్న పరిణామాలేంటో తెలుసుకుందాం.

Written by - Bhoomi | Last Updated : Aug 12, 2024, 05:14 PM IST
Explainer : వివాదాల్లో సెబీ చైర్ పర్సన్..మెట్టు దిగకుండా మొండి పట్టుదల ఎందుకు? రాజీనామా చేయాలంటూ వరుస డిమాండ్లు..!!

Hindenburg vs Adani Saga:  హిండెన్ బర్గ్ రిపోర్టు తర్వాత సెబీ చైర్ పర్సన్ మాధభి బుచ్ తనపై వచ్చిన ఆరోపణల ఖండిస్తూ ఆమె తీవ్ర స్థాయిలో ఈ రిపోర్టును దుయ్యబట్టారు. ఇది వ్యక్తిత్వ హననానికి ఉద్దేశించిన రిపోర్టు అని ఆమె తప్పు పట్టారు.అంతేకాదు అదానీ ఎంటర్ ప్రైజెస్ సంస్థతో తనకు ఉన్న లింకులను ఆమె కొట్టిపారేశారు. కానీ అదానీ గ్రూపు సంస్థలతో ఆమెకు ఉన్నటువంటి లింకులను నిర్ద్వంద్వంగా తోసి పుచ్చడంలో మాత్రం ఆమె విఫలమయ్యారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అదానీ గ్రూపు కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఫండ్స్ లో సెబీ చైర్ పర్సన్ కు వాటాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆమె వివరణాత్మకంగా ఖండన ఇప్పటి వరకూ లభించకపోవడంపై చాలా మందిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు నిపుణులు. 

ఇప్పటికే ఆమెకు ఆయా విదేశీ ఫండ్ హౌసెస్ లో వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్  రీసెర్చ్ పేపర్లు విజిల్ బ్లోయర్ల రిపోర్టుల ద్వారా స్పష్టంగా తెలుపుతోంది. అయితే వీటిని కేవలం ముక్తసరిగా ఖండిస్తే సరిపోదని ఈ సీరియస్ అలిగేషన్స్ ను  వివరణాత్మకంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది స్టాక్ మార్కెట్లు అదేవిధంగా భారత సెక్యూరిటీ మార్కెట్లపై నమ్మకాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత సెబీ చైర్పర్సన్ పై ఉందని కూడా అంటున్నారు.  

రిటైల్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టేందుకు: 

ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం సెబీ చైర్ పర్సన్ తనపై వచ్చిన  ఆరోపణలను నిర్మాణాత్మకంగా నిరూపించాల్సిన అవసరం ఉంది. నిజానికి సెబీ అనేది ఒక ప్రభుత్వ ఏజెన్సీ  సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా(SEBI) సెబీ చట్టం 1992 ద్వారా స్థాపించారు.సెక్యూరిటీ మార్కెట్లను నియంత్రించే ఈ సంస్థకు ఉన్నత స్థాయిలో ఉన్న చైర్ పర్సన్ ప్రభుత్వ ఏజెన్సీకి అధిపతి అన్న సంగతి ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంది. 2022లో ఆమె పదవి చేపట్టారు. సెబీ చీఫ్ గా తొలిసారి ఒక ప్రైవేట్ సెక్టార్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఆమె సెబీలో ప్రవేశించడం గమనార్హం. గతంలో సెబి చైర్మన్లుగా పనిచేసిన వారిలో చాలా మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి వచ్చిన ఆఫీసర్లు ఉన్నారు. మాధభి బుచ్ మాత్రమే నాన్ సివిల్ సర్వెంట్ గా సెబీలోకి ప్రవేశించారు. 

సెబీ చైర్ పర్సన్ రాజీనామా:

ఇదిలా ఉంటే సెబి చైర్ పర్సన్ భర్త దవల్ బుజ్ అలాగే అదానీ మధ్య అనేక ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయని రీసర్చ్ పత్రాలు ఆరోపించాయి. ఆదానీ లింకు ఉన్నటువంటి స్టాక్స్ లో పలు గ్లోబల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టాయి. వీటిలో ఒక దాంట్లో 2015లో స్వయంగా సెబీ చైర్ పర్సన్ మాదాభి ఆమె భర్త సంయుక్తంగా ప్రారంభించిన ఫండ్ ఉండటం గమనార్హం.

Also Read : Hindenburg Research: హిండెన్ బర్గ్ రీసెర్చ్ వెనుక ఎవరు ఉన్నారు...వీళ్ల ఆదాయ మార్గం ఏంటి..? మార్కెట్లో అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి..?

ఇలాంటి సందర్భం తలెత్తినప్పుడు సెబీ చైర్మన్ రాజీనామా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని సెబీ బోర్డు మాజీ సభ్యుడు ఒకరు ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తాపత్రికతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ గతంలో అదానీ గ్రూప్ ఉపయోగించిన ఆఫ్‌షోర్ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టారని ఆరోపణ నేపథ్యంలో, ఈ ఆరోపణలు నిజమైతే, సంబంధిత వ్యక్తులు రాజీనామా చేయాలని ప్రముఖ పెట్టుబడిదారు మార్క్ ఫాబర్  అన్నారు.

సెబీ చైర్ పర్సన్ పై మరిన్ని ఆరోపణలు: 

తమపై వస్తున్న ఆరోపణలను మాధబి బచ్ ఖండించిన కొన్ని గంటల తర్వాత హిండెన్ బర్గ్ మరోసారి ట్వీట్లు చేసింది. బచ్ చేసిన ప్రకటన మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలు లేవనెత్తుతోందని పేర్కొంది. సెబీ చీఫ్ స్పందనపై ఆదివారం రాత్రి మరోసారి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో స్పందించింది. మాధబి స్పందనలో ఆమెకు బెర్మడా, మారిషస్ ఫండ్స్ ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. అంతేకాదు ఆ ఫండ్స్ ను ఆమె భర్త ధావల్ చిన్ననాటి స్నేహితుడు నడుపుతున్న విషయం కూడా బయటపడిందని పేర్కొంది. అంతేకాదు అతను ప్రస్తుతం అదానీ గ్రూపులో డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు హిండెన్ బర్గ్ వెల్లడించింది. 

దేశాన్ని కుదిపేసిన రిపోర్ట్ : 

గత రెండు రోజులుగా హిండెన్ బర్గ్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ కేసులో కొన్ని చిక్కుముడులు ఉన్నాయి. నేరుగా సెబీ చైర్ పర్సన్ పై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ పారదర్శకంగా జరగాలంటే..ఆమె రాజీనామా చేసి విచారణకు సహకరిస్తేనే సాధ్యం అవుతుందని సెబీ మాజీ సభ్యుడు ఒకరు తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిందే: 

కేంద్ర ఆర్ధిక వ్యవహారాల శాఖ, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే తప్పా విచారణ ముందుకు సాగదు. రాజీనామా అనేది కేవలం నైతిక బాధ్యత మాత్రమే. ఇది చైర్ పర్సన్ ముందున్న ఒక ఆప్షన్ మాత్రమే. ఇది తప్పనిసరికాదని మార్కెట్ విశ్లేషకులు ఒకరు తెలిపారు. 
Also Read : Gold Rate Today: తగ్గినట్లే తగ్గి షాకిస్తున్న బంగారం ధరలు..తాజాగా తులం బంగారం ధర ఎంతంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News