Small Finance Banks FD Rates: చాలా మంది తమ డబ్బు సురక్షితంగా ఉండేందుకు.. మంచి ఆదాయం కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఈ ఎఫ్‌డీ మంచి ఆప్షన్‌. సాధారణ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇతర పెద్ద బ్యాంకులు 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు మరింత అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఫిన్‌కేర్, ఈక్విటాస్, నార్త్ ఈస్ట్, ESAF, సూర్యోదయ, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు ప్రపంచ సీనియర్ సిటిజన్ డే (ఆగస్టు 21) సందర్భంగా వడ్డీ రేటుపై బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి. ఈ బ్యాంకులు అందించే ఆకర్షణీయమైన ఎఫ్‌డీ రేట్ల గురించి తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఎఫ్‌డీలపై 9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ రేట్లు ఈ ఏడాది 14వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.


ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీలపై మంచి ఆఫర్ ప్రకటించింది. 500 రోజులకు 9 శాతం, 750 రోజులకు 9.43 శాతం, 1000 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలకు 9.21 శాతం చొప్పున వడ్డీని అందిస్తోంది. 36 నెలల 1 రోజు నుంచి 42 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లకు 9.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ రేట్లు జూలై 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1095 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 9 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. 


555, 1111 రోజులలో మెచ్యూర్ అయ్యే  ఫిక్స్‌డ్‌ డిజిపాట్లపై నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 9.25 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది. ఈ రేట్లు జూన్  6వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. స్పెషల్ స్కీమ్‌ కింద ఈ రెండు వడ్డీ రేట్లను అందిస్తోంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2 నుంచి 3 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.10 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు ఆగస్టు  7వ తేదీ నుంచి అమలుచేస్తోంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఎఫ్‌డీలపై కూడా 9 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6 నెలల నుంచి 201 రోజుల ఎఫ్‌డీలపై 9.25 శాతం, 501 రోజుల ఎఫ్‌డీలపై 9.25 శాతం, 1001 రోజుల ఎఫ్‌డీలపై 9.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ రేట్లు ఆగస్టు 11వ తేదీ నుంచి అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది.


Also Read: Onion Prices Today: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 40 శాతం ఎగుమతి సుంకం విధింపు  


Also Read: Interest Rates Hike:ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. సేవింగ్ అకౌంట్స్‌ వడ్డీ రేట్లు పెంపు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook