FD Techniques: ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు మెచ్యూరిటీ కంటే ముందే పూర్తి ప్రయోజనాలతో తీసుకోవడం ఎలాగో తెలుసా మీకు. దానికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ పాటిస్తే మెచ్యూరిటీ పూర్తి కాకుండా..ప్రయోజనాలు పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది గ్యారంటీతో కూడిన పెట్టుబడి పధకం. ఎక్కువమంది ఇష్టపడే సేవింగ్ స్కీమ్ ఇది. వివిధ రకాల బ్యాంకులు వేర్వేరు కాల పరిమితి, వేర్వేరు వడ్డీ రేట్లతో ఎఫ్‌డి అవకాశాలు కల్పిస్తుంటాయి. ఓ నిర్ణీత వ్యవధి తరువాత వడ్డీరూపంలో మీ ఎక్కౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి. కానీ ఏదైనా అవసరంతో మెచ్యూరిటీ పీరియడ్ కంటే ముందే ఎఫ్‌డి బ్రేక్ చేస్తే మీకు ఇబ్బందులుంటాయి. పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా మీ లాభం తగ్గిపోతుంది. 


ఎఫ్‌డి ల్యాడరింగ్ టెక్నిక్‌తో ఉపయోగాలు


దేశంలో అతిపెద్ద బ్యాం‌కింగ్ వ్యవస్థ ఎస్బీఐ. ఎస్బీఐకు చెందిన ఐదేళ్ల ఎఫ్‌డి ను నిర్ణీత సమయం కంటే ముందే బ్రేక్ చేయాలంటే 0.5 శాతం పెనాల్టీ చెల్లించాలి. 5 లక్షల రూపాయల ఎఫ్‌డిను ఐదేళ్లకు చేయాల్సివచ్చినప్పుడు ఒకేసారి చేయవద్దు. ఆ మొత్తాన్ని వేర్వేరు భాగాల్లో విభజించాలి. అంటే ఐదు భాగాలు చేయండి. ఇప్పుడు ఐదు ఎఫ్‌డిలుగా వేయండి. ఫలితంగా ఐదు ఎఫ్‌డిల మెచ్యూరిటీ కూడా వేర్వేరుగా ఉంటుంది. వీటిని ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు, ఐదేళ్ల మెచ్యూరిటీ వ్యవధితో వేయండి. ఇలా చేయడం వల్ల మీకు అవసరమైనప్పుడు డబ్బులు చేతికందే మార్గముంటుంది. ఈ టెక్నిక్‌ను ఫిక్స్ డిపాజిట్ ల్యాడరింగ్ అంటారు. 


ఐదు డిపాజిట్‌ పధకాలు వేర్వేరుగా ఉండటం వల్ల అవసరమైనప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు‌ అవసరమైనప్పుడు తీసి..తరువాత మళ్లీ వేయవచ్చు కూడా. ఒక ఎఫ్‌డి ఏడాదికి మెచ్యూర్ అయిన తరువాత మరో ఏడాదికి అంటే మొత్తం రెండేళ్లకు మెచ్యూర్ అవుతుంది. ఆ తరువాత దానికి మరో ఐదేళ్లకు ఫిక్స్డ్ చేసుకోవచ్చు. 


రిటైర్డ్ వ్యక్తుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ ల్యాడరింగ్ టెక్నిక్ మంచి ప్రత్యామ్నాయం. దీనివల్ల వారికి రెగ్యులర్ ఆదాయం లభిస్తుంది. నగదు సమస్య కూడా తలెత్తదు. డబ్బులు అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా ఈ విధానంలో ఎఫ్‌డి చేసుకుంటే ఏ విధమైన సమస్య ఉండదు. ఈ విధానంతో మీకు చాలా ప్రత్యామ్నాయాలుంటాయి. మొదటి ఎఫ్‌డి మెచ్యూర్ అయిన తరువాత ఎక్కువ లాభాల కోసం ఆ డబ్బును మరోచోట పెట్టుబడిగా పెట్టవచ్చు. ఒకేచోట మీ డబ్బులు బ్లాక్ కాకుండా ఉంటాయి. అందుకే ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు ఈ విధానం అత్యుత్తమం.


Also read; Flipkart iPhone 12: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్ ఆఫర్‌తో చౌక ధరకే కొనుగోలు చేసే ఛాన్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Linkhttps://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook