FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు.. ఏ బ్యాంక్‌లో ఎంతంటే..?
Fixed Deposit Rates in Banks: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో బ్యాంకులు మార్పులు చేశాయి. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఇంట్రెస్ట్ రేట్లను పెంచుతూ కొన్ని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. అత్యధికంగా 9.5 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.
Fixed Deposit Rates in Banks: సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) వడ్డీ రేట్లు మారాయి. మన దేశంలో సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. సాధారణ కస్టమర్లకు అందించే వడ్డీ రేటు కంటే 0.50 శాతం అదనపు వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నాటికి కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లలో మార్పులు చేశాయి. సాధారణంగా పెద్ద బ్యాంకుల కంటే చిన్న ఫైనాన్స్ బ్యాంకులే అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి.
Also Read: లగ్గంతో రానున్న రాజేంద్రప్రసాద్.. పెళ్లిపుస్తకం తరువాత ఆ స్థాయి చిత్రం అంటున్న నటుడు
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్లు 1,001 రోజుల ఎఫ్‌డీలపై 9.50 శాతం ఇంట్రెస్ట్ రేటును పొందవచ్చు. ఈ బ్యాంక్ ఈ నెల 2వ తేదీన వడ్డీ రేట్లను సవరించింది. సీనియర్ సిటిజన్‌లకు ఆరు నెలల నుంచి 201 రోజుల ఎఫ్‌డీలకు 9.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 501 రోజుల ఎఫ్‌డీలపై బ్యాంక్ వృద్ధులకు 9.25 శాతం అందిస్తుంది. 701 రోజుల కాల వ్యవధికి 9.45 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
సీనియర్ సిటిజన్లకు పంజాబ్ & సింధ్ బ్యాంక్ ఎఫ్‌డీలపై ఫిబ్రవరి 1న రేట్లను సవరించింది. 444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లల కోసం 8.10 శాతం ఆఫర్ చేస్తోంది. ఈ స్పెషల్ ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్ చేసేందుకు మార్చి 31వ తేదీ వరకు అవకాశం ఉంది. కరూర్ వైశ్యా బ్యాంక్ (KVB) కూడా ఎఫ్‌డీ రేట్లను ఫిబ్రవరి 1వ తేదీన సవరించింది. కరూర్ వైశ్యా బ్యాంక్ (KVB) సీనియర్ సిటిజన్‌లకు 444 రోజుల కాల వ్యవధి ఎఫ్‌డీలో అత్యధికంగా 8.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
సీనియర్ సిటిజన్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 400 రోజుల ఎఫ్‌డీలపై గరిష్టంగా 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంక్ ఫిబ్రవరి 1న వడ్డీ రేట్లను సవరించింది. పీఎన్‌బీ సాధారణ, సీనియర్ సిటిజన్‌లతో పాటు సూపర్ సీనియర్‌లకు 300 రోజుల డిపాజిట్లపై 80 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ డిపాజిట్లు సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
Also Read: Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter