Flight Ticket offers: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ల బుకింగ్‌పై బంపర్ ఆఫర్
Vistara Sale 2023: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్. టికెట్ల బుకింగ్‌పై బంపర్ ఆఫర్ ఉంది. టాటా గ్రూప్ ప్రీమియం ఎయిర్‌లైన్ విస్తారా భారీ ఆఫర్‌తో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఇస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Vistara Sale 2023: మీరు ఫ్లైట్ జర్నీకి ప్లాన్ చేస్తున్నారా..? మీరు కూడా రాబోయే రోజుల్లో దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ఎక్కడైనా ప్రయాణించాలని ఆలోచిస్తున్నట్లయితే.. తక్కువ రేట్లకే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. టాటా గ్రూప్ ప్రీమియం ఎయిర్‌లైన్ విస్తారా మీకు తక్కువ డబ్బుతో టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కంపెనీ తన ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ప్రయాణికుల కోసం ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
విస్తారా తన 8వ వార్షికోత్సవం సందర్భంగా మీ కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో మీరు ముందస్తు సీటు ఎంపిక, యాక్సెస్ బ్యాగేజీపై 23 శాతం డిస్కౌంట్ పొందుతారు. దీంతో పాటు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో మీ ప్రయాణాన్ని ఆనందదాయకంగా మార్చడానికి విస్తారా మీకు ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది. పూర్తి వివరాల కోసం https://bit.ly/3IFmP90 వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఈ సేల్‌లో విస్తారా కేవలం 1899 రూపాయలకే విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఆఫర్ జనవరి 12 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మీకు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి 4 రోజుల సమయం ఉంది.
ఈ ఆఫర్‌లో మీరు ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చు. దేశీయ ప్రయాణానికి వన్ వే టిక్కెట్ ధర రూ.1899 నుంచి ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ ప్రయాణ టికెట్ ధర రూ.13,299 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో పాటు ముందస్తు సీట్ల ఎంపిక, యాక్సెస్ బ్యాగేజీపై కంపెనీ 23 శాతం తగ్గింపును అందిస్తోంది.
విస్తారా ఎయిర్‌లైన్‌లో టాటా గ్రూప్‌కు 51 శాతం వాటా, 49 శాతం వాటా సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఎ) వద్ద ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాతో విస్తారాను విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ కింద రూ.2,058.5 కోట్ల పెట్టుబడి కూడా పెట్టనున్నారు.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం..!
Also Read: Income Tax: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఏ స్లాబ్‌లో ఎంత ట్యాక్స్ పే చేయాలంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి