Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం..!

India vs Sri Lanka ODI Series: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి సిఫార్సు మేరకు బుమ్రాను శ్రీలంక సిరీస్‌ నుంచి తప్పించినట్లు సమాచారం. మరికొంత కాలం విశ్రాంతి అవసరమని సూచించినట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2023, 03:32 PM IST
Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం..!

India vs Sri Lanka ODI Series: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బుమ్రాకు మరికొంత కాలం విశ్రాంతి అవసరమని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి సిఫార్సు మేరకు బుమ్రాను శ్రీలంక సిరీస్‌ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, ఈ ఏడాది వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని రిస్క్ ఎందుకు అని భావిస్తున్నట్లు సమాచారం. 

శ్రీలంకతో జరగనున్న 'మాస్టర్ కార్డ్' మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ముందుగా ప్రకటించిన టీమ్‌లో బుమ్రా పేరు లేదు. వెన్ను నొప్పి కారణంగా బుమ్రా గతేడాది సెప్టెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే జనవరి 3న ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించిన తర్వాత బుమ్రాను వన్డే సిరీస్‌లో చేర్చారు. తాజాగా ఎన్‌సీఏ సిబ్బంది సూచన మేరకు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో చేరవచ్చని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది.   

శ్రీలంకతో ఇటీవల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుపొందిన భారత్.. వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 10, 12, 15 తేదీల్లో గౌహతి, కోల్‌కతా, త్రివేండ్రంలలో మూడు వన్డేలు జరగనున్నాయి. వన్డే సిరీస్‌కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.

Also Read: Shrihan Beating Video : శ్రీహాన్‌ బెల్టుతో కొట్టుకున్న వీడియో.. చిన్మయి పోస్ట్‌తో వివాదం.. క్లారిటీ ఇచ్చిన సిరి

Also Read: కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదన్న వర్మ.. డబ్బు కోసం ఏమైనా నాకుతావని!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News