Flipkart, Amazon sale: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్​కార్ట్, అమెజాన్ ఇండియా మరో సెల్​కు (E-commerce sale 2022) సిద్ధమయ్యాయి. రిపబ్లిక్​ డే సందర్భంగా ప్రత్యేక సేల్ (Repubukc day sale) నిర్వహించనున్నాయి. స్మార్ట్​ ఫోన్లు, టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్​, గృహోపకరణాలు సహా ఇతర అన్ని రకాల వస్తువులపైనా భారీ డిస్కాంట్లతో విక్రయించనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్​కార్ట్​ సేల్ ఇలా..


ఫ్లిప్​కార్ట్ 'బిగ్​ సేవింగ్​ డేస్'​ పేరుతో ఈ సేల్ (Flipkart Big Saving Days sale 2022)​ నిర్వహిస్తోంది. రేపటి నుంచి (జనవరి 17 సోమవారం) ఈ సేల్​ ప్రారంభం కానుంది. ఈ నెల 22 వరకు సేల్​ (Flipkart Republic Day Sale 2022) కొనసాగనుంది. అయితే ఫ్లిప్​కార్ట్ ప్లస్​ యూజర్లకు మాత్రం ఈ ఆఫర్లు నేటి నుంచే అందుబాటులోకి వచ్చింది.


ఫ్లిప్​కార్ట్ ఆఫర్లు..


స్మార్ట్​ఫోన్ బ్రాండ్లు.. యాపిల్​, రియల్​మీ, పోకో, షియోమీ, శాంసంగ్​, ఒప్పొ, ఇన్ఫీనిక్స్​ వంటి వాటిపై 40 శాతం వరకు డిస్కౌంట్ (Flipkart offers on Smartphones) ఇస్తోంది.


శాంంసగ్​, ఎల్​జీ, సోనీ, షియోమీ, వన్​ ప్లస్ సహా ఇతర బ్రాండ్ల స్మార్ట్​ టీవీలపై 25 శాతం డిస్కౌంట్లు ప్రకటించింది. ల్యాప్​టాప్​లపై 40 శాతం వరకు డిస్కౌట్లు ఇస్తోంది.


గృహోపకరణాలపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఫ్లిప్​కార్ట్ తెలిపింది.


బ్యాంక్ ఆఫర్ల్​..


ఈ స్పెషల్​ సేల్​లో ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్​, క్రెడిట్​ కార్డ్​ల ద్వారా లవాదేవీలు జరిపి వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈ ఎంఐ లావాదేవీలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.


ఇక యాక్సిస్​ బ్యాంక్​ ఫ్లిప్​కార్ట్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి.. స్పెషల్ సేల్ ఆఫర్​తో పాటు 5 శాతం అదనపు డిస్కౌంట్ లభించనుంది.


అమెజాన్ సేల్​ ఇలా..


అమెజాన్​.. 'గ్రేట్​ రిపబ్లిక్​ డే సేల్​' పేరుతో ప్రత్యేక సేల్ (Amazon Great Republic Day Sale 2022) నిర్వహిస్తోంది. ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. అయితే ప్రైమ్​ యూజర్లకు (Amazon Republic Day Sale 2022) మాత్రం ఒక రోజు ముందుగానే (జనవరి 16) నుంచే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది.


అమెజాన్​ ఆఫర్లు..


అన్ని రకాల స్మార్ట్​ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్​. యాక్సెసరిస్​లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని (Amazon offers on Smartphones) పేర్కొంది.


ఇతర గాడ్జెట్స్​, గృహోపకరణాలపై కూడా భారీ  డిస్కౌంట్లు అందుబాటుల అందుబాటులో ఉంటాయని పేర్కొంది అమెజాన్​ ఇండియా.


వన్​ ప్లస్​ 9 ప్రో 5జీ మొబైల్ ధరను దాదాపు రూ.9 వేల తగ్గింపుతో విక్రయించనుంది అమెజాన్​. ఈ ఫోన్ అసలు ధర రూ.64,999గా ఉండగా.. గ్రేట్​ రిపబ్లిక్​ డే సేల్​లో భాగంగా 55,999గా నిర్ణయించింది.


రెడ్​మీ 32 అంగూళాల స్మార్ట్​ టీవీ ధరను రూ.24,999 నుంచి రూ.13,499కి (Amazon offers on TVs) తగ్గించింది.


ఎస్​బీఐ కార్డ్​ ద్వారా కొనుగోళ్లు జరిపే వారికి ఆఫర్​ ధరతో పాటు.. 10 శాతం తక్షణ (Amazon Bank offers) డిస్కౌంట్ లభించనుంది.


Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా


Also read: Maruti Suzuki Price Hike: మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు- అదే బాటలో మరిన్ని కంపెనీలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook