Maruti Suzuki Price Hike: మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు- అదే బాటలో మరిన్ని కంపెనీలు!

Maruti Suzuki Price Hike: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరోసారి ధరలు పెంచింది. ధరల పెంపుపై కంపెనీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 11:40 PM IST
  • మరోసారి కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకీ
  • తక్షణమే పెరిగిన ధరలు అమలులోకి
  • గత ఏడాది నుంచి ఇది నాలుగో సారి
  • ధరల పెంపుపై మరిన్ని కంపెనీలు యోచన!
Maruti Suzuki Price Hike: మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు- అదే బాటలో మరిన్ని కంపెనీలు!

Maruti Suzuki Price Hike: దేశీయ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజీకీ ఇండియా (ఎంఎస్​ఐ) పండుగ రోజున షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు శనివారం (MSI hike Cars prices) ప్రకటించింది. మోడళ్ల వారీగా 4.3 శాతం వరకు ధరలను పెంచినట్లు పేర్కొంది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.

ధరల పెంపు ఎందుకు?

ముడి పదార్థాల ధరలు పెరిగిన కారణంగా.. కార్ల తయారీ వ్యయాలు పెరిగినట్లు మారుతీ పేర్కొంది. ఇందుకోసమే పెరిగిన భారంలో కొంత వినియోగదారులపై మోపక తప్పడం (Maruti Suzuki on Cars price hike) లేదని వెల్లడించింది.

మారుతీ సుజుకీ.. వివిధ మోడళ్లపై 0.1 శాతం నుంచి 4.3 శాతం వరకు ధరలు పెంచినట్లు వివరించింది. ఢిల్లీ ఎక్స్​ షోరూం ధర 1.7 శాతం పెరిగినట్లు పేర్కొంది.

గత ఏడాది నుంచి వరుసగా ధరల పెంపు..

గత ఏడాది నుంచి మారుతీ సుజుకీ వరుసగా ధరలు పెంచుతూ వస్తోంది. ధరలు పెంచిన ప్రతిసారి ముడి పదార్థాల వ్యయాలు పెరగటమే కారణంగా వెల్లడిచింది. 2021లో మొత్తం మూడు సార్లు ధరలను పెంచింది మారుతీ సుజుకీ.

2021 జనవరిలో 1.4 శాతం, 2021 ఏప్రిల్​లో 1.6 శాతం, 2021 సెప్టెంబర్​లో 1.9 శాతం చొప్పున ధరలు పెరిగాయి.

మారుతీ సుజుకీ ప్రస్తుతం ఆల్టో నుంచి ఎస్​-క్రాస్​ మోడళ్లను రూ.3.15 లక్షల నుంచి రూ.12.56 లక్షల రేంజ్​లో (MSI latest news) విక్రయిస్తోంది.

మారుతీ సుజుకీ బాటలోనే మరిన్ని సంస్థలు కూడా కార్ల ధరలు పెంచే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా అన్ని సంస్థలు ముడి సరుకు వ్యయాల కారణంతో.. తమ కార్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే.

Also read: EPF balance check: ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా?

Also read: SBI FD rates: ఎస్​బీఐ గుడ్​ న్యూస్​- ఫిక్స్​డ్​ డిపాజిట్​ వడ్డీ రేట్లు పెంపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News