Flipkart Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ ధమాల్ సేల్ పేరిట భారీ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై భారీ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీల్లో థామ్సన్ 9ఏ సిరీస్ 80సెం.మీ (32 అంగుళాలు) టీవీపై భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ రూపంలో గతంలో కన్నా ఎక్కువ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకున్నట్లయితే రూ.14,499 విలువ చేసే ఈ టీవీని కేవలం రూ.1024కే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ 17 శాతం డిస్కౌంట్ :


థామ్సన్ 9ఏ సిరీస్ 80 సెం.మీ (32 అంగుళాలు) ప్రస్తుతం మార్కెట్లో రూ.14,499కి అందుబాటులో ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 17 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే.. డిస్కౌంట్ ద్వారా రూ.2500 వరకు ఆదా అవుతుంది. డిస్కౌంట్ పోను ఈ స్మార్ట్ టీవీ రూ.11,999కి అందుబాటులో ఉంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుకు కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై మరో రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.11,499కే మీ సొంతం చేసుకోవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :


ఫ్లిప్‌కార్ట్‌లో థామ్సన్ 9ఏ సిరీస్ 80 సెం.మీ (32 అంగుళాలు)పై భారీ ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ రూపంలో గతంలో గరిష్ఠంగా రూ.7500 వరకు తగ్గింపు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు దాన్ని రూ.10,975కి పెంచింది. మీ పాత స్మార్ట్ టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. టీవీ కండిషన్‌ను బట్టి రూ.7500 వరకు తగ్గింపు పొందుతారు. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే.. రూ.11,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవీని డెడ్ చీప్‌గా రూ.1024కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. బిగ్ బచత్ ధమాల్ సేల్ (జూలై 1-జూలై 3) ఉన్నంతవరకే అందుబాటులో ఉంటుంది. 



Also Read: Lucky Zodiac Signs: తిరుగులేని అదృష్టమంటే ఈ 5 రాశుల వారిదే.. ఎప్పుడూ లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.. 


Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ... రూ.20 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.2349కే..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook