Flipkart Offer: ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.78వేలు విలువ చేసే ల్యాప్‌టాప్ కేవలం రూ.36వేలకే
Flipkart Laptop Offers: ఫ్లిప్‌కార్ట్‌లో `బిగ్ బచత్ ధమాల్ సేల్` కింద ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల ల్యాప్‌టాప్‌లను అతిచౌక ధరకే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Laptop Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెల్లువ కొనసాగుతోంది. మరోసారి 'బిగ్ బచత్ ధమాల్' సేల్ పేరిట ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్ జూన్ 2 నుంచి జూన్ 5 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా రూ.78,990 విలువ చేసే 'ఆసస్ వివో బుక్ కె15 ఓఎల్ఈడీ (2022)' ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.36వేలకే మీ సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తించినట్లయితే మీకు ఈ భారీ తగ్గింపు లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న డిస్కౌంట్ :
ప్రస్తుతం మార్కెట్లో 'ఆసస్ వివో బుక్ కె15 ఓఎల్ఈడీ' ధర రూ.78,990. కానీ ఫ్లిప్‌కార్ట్ 27 శాతం తగ్గింపుతో కేవలం రూ.56,990కే అందిస్తోంది. ఒకవేళ ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉపయోగించినట్లయితే 5 శాతం క్యాష్ బ్యాక్ పొందుతారు. అంటే.. రూ.2849 మేర తగ్గింపు లభించినట్లే. అలా, ఈ ల్యాప్‌టాప్‌ను రూ.54,141కే పొందవచ్చు.
ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.56,990కి అందుబాటులో ఉన్న 'ఆసస్ వివో బుక్ కె15 ఓఎల్ఈడీ' ల్యాప్‌టాప్‌పై రూ.18,100 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. ఈ ఆఫర్ పూర్తిగా వర్తించినట్లయితే రూ.38,890కే ఈ ల్యాప్‌టాప్ మీ సొంతమవుతుంది. ఒకవేళ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో దీన్ని కొనుగోలు చేసినట్లయితే మరో రూ.2849 మేర తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ ల్యాప్‌టాప్‌ను మరింత చౌకగా రూ.36,041కే పొందవచ్చు. అయితే డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి.
Also Read : Sharmila Comments: ఈదరిద్రాన్ని మనమే మోయలేం..దేశానికి కావాలా..షర్మిల ఘాటు వ్యాఖ్యలు..!
Also Read: Divyavani Comments: టీడీపీలో మహిళలకు గౌరవం లేదు..దివ్య వాణి సంచలన వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook