Special Discount on iPhones: ఊహించని ధరకు ఐఫోన్ 13, ఐఫోన్ 11, ఐఫోన్ 12 మినీ, ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Special Discount on iPhones: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సంచలనం కల్గించనుంది. టీజర్లు ఈ సేల్‌పై ఆసక్తి రేపుతున్నాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 11 ధరలు ఆసక్తి కల్గిస్తున్నాయి..
Special Discount on iPhones: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సంచలనం కల్గించనుంది. టీజర్లు ఈ సేల్‌పై ఆసక్తి రేపుతున్నాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 11 ధరలు ఆసక్తి కల్గిస్తున్నాయి..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ నెలాఖరువరకూ కొనసాగే ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు లభించనున్నాయని టీజర్ల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ 13, ఐపోన్ 11 ధరలు ఆసక్తి రేపుతున్నాయి. అతి తక్కువ ధరకే ఈ రెండు మోడల్స్ లభ్యం కానున్నట్టు తెలుస్తుండటంతో ఆసక్తి పెరుగుతోంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ టీజర్ల ద్వారా ఐఫోన్ 13, ఐఫోన్ 11, ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్లు అతి తక్కువ ధరకే లభ్యం కానున్నట్టు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 13 కేవలం 49, 990 రూపాయలకే లభ్యం కానుందని తెలుస్తోంది. ఇటీవల యాపిల్ సంస్థ ఐఫోన్ 13 ధరను 69,990 రూపాయలకు తగ్గించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరో 20 వేల రూపాయలు డిస్కౌంట్ ఇవ్వవచ్చని సమాచారం.
ఫ్లాట్ డిస్కౌంట్ కాకుండా ఇతర బ్యాంకు ఆఫర్లు, ప్రీపెయిడ్ ఆర్డర్ ఆఫర్లు, ఎక్స్చైంజ్ ఆఫర్లతో కలిపి ఈ ప్రత్యేక ఆఫర్ వర్తించవచ్చు. ఐఫోన్ 13.. 49,990 రూపాయలు ఎలా లభిస్తుందనేది సేల్ ప్రారంభమైతే గానీ స్పష్టత రాదు. యాపిల్ ఛార్జర్‌ను అదనంగా తీసుకోవాలి.
ఇక ఐఫోన్ 11 30 వేలకంటే తక్కువకే అందుబాటులో ఉన్నట్టు టీజర్ల ద్వారా తెలుస్తోంది. ఐఫోన్ 12 మిని కూడా 40 వేలకంటే తక్కువే ఉండవచ్చు. ఇవి కాకుండా ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లపై ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్ ఉండవచ్చని తెలుస్తోంది. ఈ రెండు వేరియంట్ల ధర వరుసగా 90 వేలు, లక్ష కంటే తక్కువే ఉండవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook