Flipkart Big Saving Days Sale 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు, ఎప్పట్నించంటే
Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఇప్పుడు వేసవి షాపింగ్‌పై దృష్టి సారించాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఐప్యాడ్, శాంసంగ్ ట్యాబ్లెట్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Big Saving Days Sale 2024: ఒక రోజు వ్యవధిలో అటు అమెజాన్, ఇటు ఫ్లిప్‌కార్ట్‌లు సమ్మర్ స్పెషల్ సేల్స్ ప్రారంభిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్స్ పేరుతో మే 2 నుంచి ప్రారంభిస్తుంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో మే 3 నుంచి ప్రారంభించనుంది. మే నెల మొదటి పదిరోజులు ఈ రెండు ప్రముఖ సంస్థ సేల్స్ హల్‌చల్ చేయనున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి మే 9వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా వివిధ రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్లు, ల్యాప్‌టాప్స్ ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్లపై, ఐప్యాడ్‌లపై , శాంసంగ్ ట్యాబ్‌లెట్లపై ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభించనుంది. అంతేకాకుండా మోటోరోలా ఎస్ 50 ప్రోపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఐప్యాడ్ 10వ జనరేషన్, శాంసంగ్ ట్యాబ్ ఎస్9 సిరీస్, వన్‌ప్లస్ ట్యాబ్‌పై ఊహించని తగ్గింపు లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో లభించే కొన్ని ఆఫర్లను తెలుసుకుందాం.
Apple iPad 10th Gen ట్యాబ్ ఇప్పుడు 30 వేల కంటే తక్కువకే లభించనుంది. ప్రస్తుతం 36,900 రూపాయల ప్రారంభధరకు అందుబాటులో ఉంది. ఇతర బ్యాంకు ఆఫర్లు కలుపుకుంటే 30 వేలకంటే తక్కువకే తీసుకోవచ్చు.
Samsung Galaxy Tab S9 and OnePlus Tabsపై కూడా ఊహించని డిస్కౌంట్ లభించనుంది. శాంసంగ్ ట్యాబ్ ఎస్ 9 50 వేల కంటే తక్కువకే లభిస్తుంది. మిడ్ రేంజ్ ట్యాబ్ ఎస్ 9 ఎఫ్ఈ ప్లస్ అయితే అన్ని ఆఫర్లు మినహాయించగా 30 వేల రూపాయల కంటే తక్కువకు దొరుకుతుంది. బ్యాంక్ ఆఫర్లను కలుపుకుంటే గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ 20 వేల కంటే తక్కువకే లభిస్తుంది. ఇక వన్‌ప్లస్ ప్యాడ్ కూడా 30 వేలకంటే తక్కువే అందుబాటులో ఉంటుంది.
Samsung S23 Series ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువకు లభించనుంది. అన్ని ఆఫర్లు మినహాయించగా ఈ ఫోన్ 45 వేల కంటే తక్కువకే లభించనుంది. గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ కూడా 40 వేల కంటే తక్కువకు పొందవచ్చు.
Moto Edge 50 Pro అనేది ఐపీ68 రేటింగ్ కలిగింది. ఆఫర్లు మినహాయిస్తే 28 వేల కంటే తక్కువకు తీసుకోవచ్చు. మోటోరోలా ఎస్ 40 నియో కూడా 20 వేల కంటే తక్కువకే లభిస్తుంది.
Also read: May 2024 Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook