Flipkart Electronics Sale 2022: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ వేదికగా ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ పై సూపర్ సేల్ నడుస్తోంది. ఎలక్ట్రానిక్స్ సేల్ పేరుతో నడుస్తున్న ఈ సేల్ జనవరి 27 నుంచి జనవరి 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ద్వారా స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ టీవీలు, ఫ్రిజ్ లు, ఎయిర్ కండీషనర్ వరకు ప్రతిదానిపై ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక తగ్గింపును అందిస్తుంది. ప్రస్తుతం ఈ సేల్ ద్వారా శాంసంగ్ కంపెనీకి చెందిన 32- అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం రూ.4,500లకే విక్రయానికి ఉంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు


Samsung 80 cm (32 inch) HD Ready LED స్మార్ట్ టీవీ మార్కెట్‌లో రూ.19,900కి అమ్మకం జరుగుతుంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో, మీరు ఈ టీవీపై 14% తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత రూ. 16,999లకే శాంసంగ్ స్మార్ట్ టీవీ అందుబాటులోకి వస్తుంది. యాక్సిస్ లేదా సిటీ బ్యాంకు క్రెడిట్ కార్టులతో చెల్లిస్తే రూ.1,500 వరకు తగ్గింపు వస్తుంది. 


ఎక్స్ఛేంజ్ ఆఫర్


శాంసంగ్ 32- అంగుళాల స్మార్ట్ టీవీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. మీ పాత టీవీకి బదులుగా Samsung 80 cm (32 inch) HD Ready LED Smart TVని కొనుగోలు చేయడం వల్ల అత్యధికంగా రూ. 11 వేల వరకు ఆదా చేయవచ్చు. ఈ కొనుగోలులో పైన చెప్పిన ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ చేస్తే.. శాంసంగ్ 32 - అంగుళాల టీవీ ఫైనల్ గా రూ. 4,499లకే మీ సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఆఫర్ ద్వారా మీరు రూ. 15,401 ఆదా చేసుకోవచ్చు.  


Samsung (32 inch) స్మార్ట్ టీవీ ఫీచర్లు..


1) ఆపరేటింగ్ సిస్టమ్ : LED స్మార్ట్ TV Tizen 


2) రిజల్యూషన్ : 1,366 x 768 పిక్సెల్స్, HD డిస్ ప్లే


3) రీఫ్రెష్ రేట్ : 60Hz 


4) సౌండ్ అవుట్ పుట్ : 20W


5) అప్లికేషన్స్ : నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి అప్లికేషన్స్ సపోర్ట్ చేస్తుంది.  


Also Read: Moto G60 for RS 149: కేవలం రూ.149లకే Moto G60 స్మార్ట్ ఫోన్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!


Also Read: WhatsApp Dangerous Scams: వాట్సప్ మోసాలు.. ఇలాంటి మెసేజ్ లు వస్తే వెంటనే జాగ్రత్త పడండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook