WhatsApp Dangerous Scams: వాట్సప్ మోసాలు.. ఇలాంటి మెసేజ్ లు వస్తే వెంటనే జాగ్రత్త పడండి!

WhatsApp Dangerous Scams: ఇంటర్నెట్ వాడే 10 మందిలో ఏడుగురు తరచూ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. వారు పన్నే పన్నాగంలో పడి ఎంతోమంది తమ డబ్బును పొగొట్టుకున్నారు. ప్రస్తుతం సమాజంలో వాట్సప్ ద్వారా ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. వాటిలోని ప్రధానమైన మూడు వాట్సప్ మోసాల గురించి మీకు చెప్పబోతున్నాం. అలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 06:24 PM IST
    • మీ స్మార్ట్ ఫోన్ లో వాట్సప్ యాప్ వినియోగిస్తున్నారా?
    • అయితే మీరు ఇలాంటి ఫార్వార్డ్ మెసేజ్ ల నుంచి తస్మాత్ జాగ్రత్త
    • మీ అకౌంట్ లో డబ్బు దొంగిలించే అవకాశం ఉంది.
WhatsApp Dangerous Scams: వాట్సప్ మోసాలు.. ఇలాంటి మెసేజ్ లు వస్తే వెంటనే జాగ్రత్త పడండి!

WhatsApp Dangerous Scams: సోషల్ మీడియా ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉన్న సన్నిహితులతో ఎప్పుడూ టచ్ లో ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అనేక విశేషాలను తెలుసుకునే అవకాశం ఉంది. అలాంటి సమయంలోనే ఆన్ లైన్ వేదికగా కొంతమంది సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు.

సైబర్ నేరగాళ్లు కల్లబొల్లి కబుర్లు చెప్పి మైమరిపిస్తారు. ఏదైనా లింక్ సెండ్ చేసి ఓపెన్ చేయమని చెప్పడం వంటి సంఘటనలు చాలానే జరిగాయి. అలాంటి కొన్ని సంఘటనలే ఇప్పుడు వాట్సప్ లో ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవలే వాట్సప్ లో మూడు మోసాలను గుర్తించినట్లు సైబర్ పోలీసులు వెల్లడించారు. అయితే అవి ఏలాంటి మోసాలు? వాటి నుంచి ఎలా దూరంగా ఉండాలనే జాగ్రత్తలను తెలుసుకుందాం. 

కుటుంబసభ్యుల పేర్లతో మోసాలు

వాట్సప్ లో అత్యంత సాధారణ స్కామ్ గా పరిగణిస్తున్నారు. తమకు సంబంధించిన కుటుంబసభ్యులు లేదా సన్నిహితులమని వాట్సప్ డీపీల ద్వారా నమ్మబలుకుతూ.. కొత్త నంబరు ద్వారా వాట్సప్ మెసేజ్ చేస్తారు. ఏదైనా ప్రమాదానికి లోనయ్యామని.. లేదా అత్యవసరంగా డబ్బు కావాలని సందేశాన్ని పంపుతారు. కానీ, ఆ మెసేజ్ చేసేది ఓ హ్యాకర్. అలాంటి మోసాల బారిన పడకుండా ఆ నంబరు నుంచి మెసేజ్ చేసింది ఎవరో తెలుసుకొని డబ్బు పంపిస్తే బాగుంటుంది.  

స్కానింగ్ కోడ్స్

ఇటీవల కొందరు హ్యాకర్లు.. ఏదైనా స్కానింగ్ కోడ్ ను వాట్సప్ సెండ్ చేసి, దాని ద్వారా డబ్బును దొంగిలిస్తున్నారు. ఇలా కొన్ని గ్రూపుల్లో ఆయా స్కానింగ్ కోడ్స్ ను షేర్ చేస్తూ.. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల్లో డబ్బును స్వాహా చేసేస్తున్నారు.   

వోచర్ స్కామ్‌లు

ఇంటర్నెట్ డబ్బును చెల్లించడం లేదా ఏదైనా వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లను ప్రస్తుతం టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వోచర్ మోసాలతోవినియోగదారులను సులభంగా మోసగిస్తున్నారు. అలాంటి స్కామ్స్ లో లాటరీని గెలుపొందడం లేదా ఖరీదైన బహుమతిని గెలుచుకోవడం గురించి మీకు మెసేజ్ లు వస్తుంటాయి. అలా ఆకర్షణీయమైన సమాచారంతో సులభంగా వారి ఉచ్చులో పడేస్తారు. ఆ బహుమతిని పొందాలంటే వ్యక్తిగత వివరాలు కావాలని చెబుతుంటారు. అలా అత్యాశకు గురై చాలా మంది డబ్బును పొగొట్టుకున్న సందర్భాలున్నాయి.

ప్రస్తుత సమాజంలో చాలా మంది పైన చెప్పిన ఈ మూడు వాట్సప్ స్కామ్ బారిన పడి డబ్బును పొగొట్టుకుంటున్నారు. ఇలాంటి వాటితోనే వినియోగదారులకు సైబర్ నేరగాళ్లు ఎరగా వేస్తున్నారు. ఆ స్కామ్ ల బారిన పడకుండా.. వాట్సప్ ద్వారా వచ్చిన మెసేజ్ ల పట్ల జాగ్రత్త వహించడం పట్ల డబ్బును పొగొట్టుకునే అవకాశాలు ఉండవు.  

Also Read: Cryptocurrency: పడిపోతున్న క్రిప్టోకరెన్సీ ధర, రష్యా ప్రభుత్వ నిషేధ ప్రకటన ఫలితమేనా

Also Read: Todays Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News