Flipkart Electronics Sale: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రకటించింది. జూన్ 23 నుంచి జూన్ 26 వరకు ఈ సేల్‌ ఉంటుంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలో బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆఫర్. అయితే ఇది లిమిటెడ్ ఆఫరే కాబట్టి కస్టమర్స్ త్వరగా ఆర్డర్స్ బుక్ చేసుకుంటే బెటర్. తాజా ఎలక్ట్రానిక్స్‌ సేల్‌లో అందుబాటులో ఉన్న వస్తువుల్లో 5 జీ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. రియల్‌మీ 9 ప్రో 5జీ (మిడ్‌నైట్ బ్లాక్ , 128 జీబీ)పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్ డిస్కౌంట్ ఆఫర్ :


రియల్‌మీ 9 ప్రో 5జీ (మిడ్‌నైట్ బ్లాక్ , 128 జీబీ) స్మార్ట్ ఫోన్ సాధారణ ధర రూ.21,999. ఎలక్ట్రానిక్ సేల్‌లో భాగంగా దీనిపై 13 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే డిస్కౌంట్ పోను రూ.18,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌ను మరింత చౌకగా రూ.17,999కే కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ.3167 చెల్లించడం ద్వారా నో కాస్ట్ ఈఎంఐ పద్దతిలోనూ ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :



రియల్‌మీ 9 ప్రో 5జీ (మిడ్‌నైట్ బ్లాక్ , 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్ సేల్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. మీ ఫోన్‌ కండిషన్‌ను బట్టి రూ.12500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ పూర్తి తగ్గింపు లభించినట్లయితే రూ.18,999 విలువ చేసే రియల్‌మీ 5జీ స్మార్ట్ ఫోన్‌ను రూ.6499కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కు షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఇది కేవలం 3 రోజుల లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. 
 



Also Read: Bandla Ganesh: ర్యాంపులు.. వ్యాంపులు వస్తుంటాయి, పోతుంటాయంటూ పూరీకి కొత్త తలనొప్పులు


Also Read: Video: అయోధ్య నదిలో స్నానం చేస్తూ.. భార్యకు ముద్దు పెట్టిన భర్త.. ఇదేం పనంటూ దాడి చేసిన మూక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.