Man Attacked for Kissing Wife: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. సరయూ నదిలో ఆ జంట స్నానం చేస్తుండగా కొందరు వ్యక్తులు దాడి చేశారు. భార్య ముందే భర్తను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అసభ్య పదజాలంతో దూషించారు. నదిలో స్నానం చేస్తుండగా ఆ వ్యక్తి తన భార్యకు ముద్దు పెట్టాడనే కారణంతో ఇలా దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ భార్యాభర్తలు ఇద్దరు నదిలో స్నానం చేస్తుండగా కాస్త రొమాంటిక్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో భర్త ఆమెకు ముద్దు పెట్టాడు. ఇది చూసి పక్కనే స్నానం చేస్తున్న కొందరు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఆ జంట వద్దకు వచ్చి భర్తను పక్కకు లాగిపడేశారు. భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. కొట్టుకుంటూ అతన్ని ఒడ్డుకు లాక్కెళ్లారు. పవిత్ర స్థలంలో ఇలాంటి పనులేంటని చెంపలు వాయించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయోధ్య పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read: Athmakuru Bypoll: నేడే ఆత్మకూరు ఉపఎన్నిక.. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు బైపోల్..
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఏయే నగరాల్లో ఎంత ధర అంటే..
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
— Suneet Singh (@Suneet30singh) June 22, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.