Flipkart Smart TV offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ కింద స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మొబైల్ ఫోన్లు ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులను అతి చౌక ధరకే అందిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ పూర్తిగా ఉపయోగించుకున్నట్లయితే వీటిని అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20 వేలు విలువ చేసే వన్‌ప్లస్ వై1 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ కేవలం రూ.15,999కే అందుబాటులో ఉంది. అయితే డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ ఉపయోగించుకున్నట్లయితే ఈ టీవీని కేవలం రూ.849కే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిస్కౌంట్ ఆఫర్ :


వన్‌ప్లస్ వై1 80 సెం.మీ (32 అంగుళాలు)  స్మార్ట్ టీవీ సాధారణ ధర రూ.19,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.15,999కే ఈ టీవీ అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ టీవీ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ.2 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు రూ.15,999 విలువ చేసే ఈ టీవీని మరింత చౌకగా రూ.13,999కే కొనుగోలు చేయవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.849కే : 


వన్‌ప్లస్ వై1 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్  టీవీ కొనుగోలుకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉపయోగించుకున్నట్లయితే కేవలం రూ.849కే దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో మీ పాత టీవీని మార్చుకున్నట్లయితే మీకు రూ.13,150 వరకు తగ్గింపు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై రూ.2 వేల వరకు తగ్గింపు కూడా వర్తించినట్లయితే రూ.15,150 వరకు మీరు డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు రూ.15,999 విలువ చేసే ఈ టీవీ మీకు రూ.849కే లభిస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న బిగ్ బచత్ ధమాల్ సేల్ ఆఫర్ ఉన్నంతవరకే ఈ డిస్కౌంట్స్ వర్తిస్తాయి. ఈ ఆఫర్ నేటి ( మే22)తో ముగియనుంది. డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌కు షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి.


Also Read: Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్.. రూ.44వేల విలువ చేసే ఐఫోన్ కేవలం రూ.3725కే...


Also Read: Flipkart Budget Phones: బడ్జెట్‌ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.14 వేలు విలువ చేసే రియల్‌మీ ఫోన్ కేవలం రూ.150కే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook