Flipkart Mi Smart TV: స్మార్ట్ టీవీలపై ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ఓ ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఈ సేల్ ప్రత్యేక తగ్గింపులతో అందుబాటులో ఉంది. ఈ సేల్ లో దాదాపుగా రూ. 30 వేల విలువైన Mi స్మార్ట్ LED టీవీ ఇప్పుడు రూ.10,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mi 4A హారిజోన్ ఎడిషన్ 40 Inch స్మార్ట్ టీవీపై తగ్గింపు


Mi 4A హారిజోన్ ఎడిషన్ 40 Inch LED స్మార్ట్ టీవీ ప్రస్తుతం మార్కెట్లో రూ.29,999లకు అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో 23 శాతం తగ్గింపుతో రూ. 22,999లకే ఈ స్మార్ట్ టీవీని విక్రయిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే అత్యధికంగా రూ.1,500 డిస్కౌంట్ వస్తుంది. దీని వల్ల ఈ టీవీ ధర రూ. 21,499లకు చేరుతుంది. అవసరమైతే ఈ Mi స్మార్ట్ టీవీపై EMIలోనూ కొనుగోలు చేయవచ్చు. 


ఎక్స్ఛేంజ్ ఆఫర్


Mi 4A హారిజోన్ ఎడిషన్ 100 సెం.మీ (40 అంగుళాల) ఫుల్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై ఎక్ఛైంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. మీ పాత టీవీని ఎక్స్ఛేంజ్ ఇచ్చి.. దానికి అత్యధికంగా రూ.11 వేల వరకు జమ అవుతుంది. దీన్ని పూర్తిగా పొందిన తర్వాత Mi స్మార్ట్ LED టీవీ రూ. 10,499లకే అందుబాటులోకి వస్తుంది. 


Mi 4A హారిజోన్ ఎడిషన్ 40 Inch ఫీచర్లు


1) డిస్ ప్లే - 1,920 x 1,080 పిక్సెల్‌ల రిజల్యూషన్ (HD LED)


2) ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్ 


3) అప్టేడ్ రేట్ - 60 Hz


4) సౌండ్ అవుట్ పుట్ - 20 W


వీటితో పాటు ఓటీటీ వేదికలైన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ + హాట్ స్టార్, యూట్యూబ్ వంటి యాప్ లు సపోర్ట్ చేస్తాయి.  


Also Read: Free fire: ఈ సారి ఫ్రీ ఫైర్ వంతు- గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్ వేటు?


Also Read: Jio Recharge Offers: జియో రూ.599 రీఛార్జ్ తో 100 GB డేటా.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook