Free fire: ఈ సారి ఫ్రీ ఫైర్ వంతు- గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్ వేటు?

Free fire: ఫ్రీ ఫైర్ గేమ్​ లవర్స్​కు బ్యాడ్ న్యూస్​. గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్లు తమ ప్లాట్​ఫామ్​ల నుంచి ఆ గేమ్​ను తొలగించాయి. ఇందుకు కారణం ఏమిటంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 08:41 PM IST
  • ఫ్రీ ఫైర్ గేమ్​ను తొలగించిన ప్లే స్టోర్​, యాప్​ స్టోర్​
  • అధికారికంగా కారణాలు వెల్లించని ఫ్రీ ఫైర్​ నిర్వహణ సంస్థ
  • క్రాఫ్టన్​ ఫిర్యాదే కారణమంటున్న వార్తా కథనాలు!
Free fire: ఈ సారి ఫ్రీ ఫైర్ వంతు- గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్ వేటు?

Free fire: దేశంలో అత్యధికంగా ఆడే మొబైల్ గేమ్​లలో గరీనా ఫ్రీ ఫైర్​ కూడా ఒకటి. ఒకప్పుడు పబ్​జీకి గట్టి పోటీ ఇచ్చిన ఈ గేమ్​.. పబ్​ జీ బ్యాన్​తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

అయితే ఫ్రీ ఫైర్ గేమ్​ లవర్స్​కు షాకిచ్చాయి గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్లు. తమ ప్లాట్​ఫామ్​ల నుంచి ఫ్రీ ఫైర్​ను తొలగించాయి. ఇందుకు కారణం ఏమిటి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇటు ఫ్రీ ఫైర్ నిర్వాహకులు కూడా దీనిపై స్పందించలేదని ప్రముఖ వార్తా సంస్థ లైవ్​ మింట్ ఓ కథనాన్ని రాసుకొచ్చింది.

పలు ఆంగ్ల వార్తా సంస్థల కథనం ప్రకారం.. బ్యాటిల్​ గ్రాండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) మాతృ సంస్థ క్రాఫ్టన్​ వల్లే ప్రీ ఫైర్ గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్ స్టోర్​ నుంచి తొలగించి ఉండొచ్చని తెలుస్తోంది. ఇందుకు కారణం ఏమిటంటే.. గరీనా తమ గేమ్​ థీమ్​ను కాపీ కొట్టినట్లు ఆరోపణలు చేస్తోంది.

ఇప్పటికే ఈ విషయమైన న్యాయస్థానాన్ని కూడా సంప్రదించింది. గరీనా సంస్థతో పాటు.. కాపీ కొట్టిన గేమ్​ను ఆయా ప్లాట్​ఫామ్​లపై డౌన్​లోడ్​కు వీలుకల్పిస్తున్నందుకు.. గూగుల్​, యాపిల్ సంస్థలపైనా క్రాఫ్టన్​ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అయితే ఈ వివాదంపై ఇంత వరకు ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఫ్రీ ఫైర్​ అందుబాటులో లేకపోయినా.. ప్లే స్టోర్​లో ఫ్రీ ఫర్​ మ్యాక్స్​ గేమ్​ మాత్రం ఇంకా డౌన్​లోడ్​లకు అందుబాటులో ఉంది. మరి క్రాఫ్టన్ ఫిర్యాదుతో ఈ గేమ్​ను కూడా తొలగిస్తారా? అనేది వేచి చూడాలి. మరో వైపు ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also read: Jio Recharge Offers: జియో రూ.599 రీఛార్జ్ తో 100 GB డేటా.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం!

Also read: New FD Rates: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్​ల కొత్త ఎఫ్​డీ రేట్లు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News