Cheapest Flight Tickets: రైలు టికెట్ ధరలోనే ఫ్లైట్ టికెట్స్
Cheapest Flight Ticket Booking Price: ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్‌లో పేరొందిన ఫ్లిప్‌కార్ట్.. బట్టలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గృహోపకరణాలే కాకుండా ఫ్లైట్ టిక్కెట్‌లను బుక్ చేసుకునే అవకాశం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకునే సదుపాయం చాలా కాలంగా అందుబాటులో ఉంది.
Cheapest Flight Ticket Booking Price: క్రిస్మస్ పండగ మరెంతో దూరంలో లేదు. ఆ తరువాత వెంటనే 2023 న్యూ ఇయర్ వేడుకలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ సందర్భంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం మీరు ఎక్కడికైనా టూర్స్ వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా ? అయితే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మీకు గొప్ప ఆఫర్ అందిస్తోంది. తక్కువ ఖర్చుతో విమానంలో ప్రయాణించే అవకాశం వస్తే ఎవరు కాదంటారు చెప్పండి.. ఇది కూడా అలాంటి అవకాశమే. ఎందుకంటే మీరు రైలు టికెట్ కోసం చేసే ఖర్చులోనే విమానంలో ప్రయాణించే అవకాశం ఇది. సాధారణంగా అయితే, ఎప్పుడైనా, ఏవైనా పండగలు వస్తే ఫ్లైట్ టికెట్స్ ధరలు కొండెక్కుతాయి. కానీ ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ ఆఫర్ మాత్రం అందుకు భిన్నంగా పండగ సీజన్ లోనూ తక్కువ ధరకే విమానయానం చేసే అవకాశం ఇస్తోంది.
ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్‌లో పేరొందిన ఫ్లిప్‌కార్ట్.. బట్టలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గృహోపకరణాలే కాకుండా ఫ్లైట్ టిక్కెట్‌లను బుక్ చేసుకునే అవకాశం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకునే సదుపాయం చాలా కాలంగా అందుబాటులో ఉంది. తాజాగా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే కస్టమర్స్‌కి డిస్కౌంట్ ప్రైస్‌కే టికెట్స్ అందిస్తోంది.
సకల సౌకర్యాలు ఉన్న లగ్జరీ రైల్లో లగ్జరీ కోచ్‌లో ఏసీ ప్రయాణం చేయాలంటే భారీ మొత్తంలోనే సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి డిమాండ్‌ని బట్టి, కోచ్ క్లాస్‌ని బట్టి ఆ ధర ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాని తాము మాత్రం కొన్ని ఎంపిక చేసిన రూట్లలో రైలు టికెట్ కంటే తక్కువకే ఫ్లైట్ టికెట్ అందిస్తున్నామంటోంది ఫ్లిప్‌కార్ట్.
ఇది కూడా చదవండి : Delhi - Hyderabad flights: ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఊహించని షాక్
ఇది కూడా చదవండి : Mother And Daughter: ఎస్ఐ ఈవెంట్స్‌లో సత్తా చాటిన తల్లీ కూతుళ్లు.. ఇన్‌స్పిరేషనల్ స్టోరీ
ఇది కూడా చదవండి : SBI Credit Card New Rules: 2023 జనవరి నుండి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కొత్త రూల్స్.. ఖర్చు విషయంలో జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook