Flipkart offers: మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌టీవీ, వాచ్, ల్యాప్‌టాప్‌లు సగానికి పైగా తగ్గింపు ధరతో..
Flipkart offers: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ జోన్ మళ్లీ వచ్చేసింది. మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ జోన్ చాలా ఉత్పత్తులపై ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Flipkart offers: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ జోన్ మళ్లీ వచ్చేసింది. మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ జోన్ చాలా ఉత్పత్తులపై ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
రెడ్‌మి నోట్ 10 ప్రోలో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 19 వేల 999 రూపాయలు కాగా..ఇప్పుడు కేవలం 15 వేల 999 రూపాయలకే లభిస్తోంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఇస్తే మరో 15 వేల 250 రూపాయల వరకూ తగ్గనుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే 20 వేల ఫోన్ కేవలం 749 రూపాయలకే లభించనుంది. ఇవి కాకుండా బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి.
షియోమి ఎంఐ 5ఎ హెచ్‌డి ఎల్ఐడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై కూడా మంచి ఆఫర్ ఉంది. 32 ఇంచెస్ ఈ స్మార్ట్‌టీవీ అసలు ధర 24 వేల 999 రూపాయలు కాగా ఇప్పుడు కేవలం 15 వేల 499 రూపాయలకు లభిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా కొనుగోలు చేస్తే మరో 750 రూపాయలు తగ్గుతాయి. ఎక్చ్సేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే..11 వేల రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ స్మార్ట్ టీవీ ధర కేవలం 3 వేల 749 రూపాయలే లభించనుంది.
ఇన్‌ఫినిక్స్ ఇన్‌బుక్ X1 థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్, అసలు ధర 49 వేల 999 రూపాయలు కాగా ఇప్పుడు ఆఫర్ జోన్‌లో 29 వేల 990 రూపాయలకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా మరో 15 వందల రూపాయలు డిస్కౌంట్ లభిస్తోంది. పాత ల్యాప్‌టాప్ ఎక్స్చేంజ్‌లో ఇస్తే 18 వేల 100 రూపాయలు తగ్గుతుంది. అంటే కేవలం 10 వేల 390 రూపాయలకు ఈ ల్యాప్‌టాప్ లభించనుంది.
ఫైర్ బోల్ట్ ఆల్ మైటీ స్మార్ట్‌వాచ్..బ్లూటూత్ కాలింగ్ , వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌తో అసలు ధర 14 వేల 999 రూపాయలు కాగా 66 శాతం తగ్గింపుతో 4 వేల 999 రూపాయలకే లభించనుంది. ఈ డీల్‌లో కొన్ని బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. కేవలం 449 రూపాయలు ప్రారంభ ఈఎంఐతో ఇంటికి తీసుకెళ్లవచ్చు.
ఇక శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7+ అసలు ధర 76 వేల 999 రూపాయలు కాగా ఇప్పుడు 49 వేల 999 రూపాయలకు లభిస్తోంది. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో 13 వేల 5 వందల రూపాయలు తగ్గుతాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 2 వేల 5 వందల రూపాయలు తగ్గుతాయి. అంటే 33 వేల 999 రూపాయలు లభించనుంది.
Also read: ITR Filing: ఐటీఆర్ దాఖలుకు ఇంకా ఒక్కరోజే గడువు.. డెడ్ లైన్ తర్వాత పెనాల్టీ తప్పదు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook