ITR Filing: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలుకు ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. జూలై 31తో ఈ గడువు ముగుస్తుంది. ఈసారి ఐటీఆర్ దాఖలుకు గడువు పెంచేది లేదని కేంద్రం ఇటీవలే స్పష్టం చేసింది. మీరు ఇప్పటికే ఐటీఆర్ దాఖలు చేసినట్లయితే టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. కానీ ఇంకా ఐటీఆర్ దాఖలు చేయనట్లయితే ఈ రెండు రోజుల్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డెడ్ లైన్ లోగా మీరు ఐటీఆర్ దాఖలు చేయనట్లయితే పెనాల్టీ తప్పదు.
జూలై 31 తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.5 లక్షల వరకు ఆదాయంపై రూ.1 వెయ్యి, రూ.5 లక్షలకు పైబడితే రూ.5000 వరకు పెనాల్టీ కింద ఆలస్యపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, మీరు చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ భారం పడుతుంది. నెలకు 1శాతం చొప్పున వడ్డీ భారం పడవచ్చు.
ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ :
ఏదైనా బ్యాంకులో లోన్ కోసం అప్లై చేసినప్పుడు ఐటీఆర్ డాక్యుమెంట్స్ ఉంటే పని సులువవుతుంది. గత మూడేళ్ల ఐటీఆర్ డాక్యుమెంట్స్‌ను సమర్పించడం ద్వారా లోన్ ప్రాసెసింగ్ పీరియడ్ తగ్గుతుంది. మీ ఐటీఆర్ డాక్యుమెంట్స్‌ను బట్టి మీ ఫైనాన్షియల్ స్టేటస్‌పై బ్యాంక్ అధికారులు త్వరగా ఒక అంచనాకు వస్తారు.
మీరు విదేశీ వీసా కోసం అప్లై చేస్తున్నట్లయితే ఐటీఆర్ ప్రూఫ్స్ తప్పనిసరి. మీ ఆర్థిక స్థితి నిలకడగా ఉందని చెప్పేందుకు ఐటీఆర్ సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఆర్ డాక్యుమెంట్స్ సమర్పించడం ద్వారా వీసా ప్రక్రియ కూడా సులువవుతుంది.
మీరు ఒకవేళ స్టార్టప్స్ కోసం ఫండ్ కలెక్ట్ చేయాలనుకున్న ఐటీఆర్ చాలా ఉపయోగడపతుంది. మీ సంస్థ ఐటీఆర్‌ను బట్టి అందులో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు, వెంచర్ కేపటలిస్ట్‌లు ముందుకొస్తారు.
యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఐటీఆర్ ప్రూఫ్స్ అవసరమవుతాయి. ఒకవేళ ఐటీఆర్ సమర్పించనట్లయితే మీరు క్లెయిమ్ చేసిన మొత్తం రాకపోవచ్చు. అందులో కోత పడవచ్చు.
Also Read: Benefits Of Neem: చర్మపై అలర్జీ నుంచి ఇలా 10 రోజుల్లో ఉపశమనం పొందండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook