Flipkart Mobile Bonanza Offer: ఆన్ లైన్ రిటైలర్ ఫ్లిప్ కార్ట్.. తమ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్ ను తీసుకొచ్చింది. నమ్మశక్యం కానీ ధరలతో రెండు రోజులు పాటు జరుగుతోన్న సేల్ సరికొత్త స్మార్ట్ ఫోన్ రకాలను మార్కెట్లో విక్రయిస్తోంది. డిసెంబరు 7 నుంచి 8 వరకు జరుగుతోన్న ఈ మొబైల్ బొనాంజా సేల్ లో అనేక ఆఫర్లతో Apple iPhone 12 Miniని కేవలం రూ.30,000 కంటే తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఇంతకీ ఆ సరసమైన ఆఫర్ ఏంటో పూర్తిగా తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 12 Miniకి సంబంధించిన బేస్ వేరియంట్.. అంటే 64 జీబీ మోడల్ మార్కెట్ లో ప్రస్తుతం రూ.44,999 వద్ద అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో రూ.16,050 తగ్గింపుతో ఈ ఫోన్ లభిస్తోంది. అనేక ఆఫర్లతో ఈ మొబైల్ కనిష్ఠ ధర రూ.28,949కి విక్రయిస్తున్నారు.


Apple iPhone 12 Mini కోసం ఫ్లిప్ కార్ట్ లో ఉన్న ఆఫర్లు..


ఫ్లిప్ కార్ట్ మొదటి ఫ్లిప్ కార్ట్ పే లేటర్ ఆర్డర్ పై రూ.500 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్యాంక్ ఆఫర్లకు ఫ్లాట్ రూ.100 తగ్గింపు లభించనుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై కస్టమర్‌లు 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.


వీటితో పాటు ICICI బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, SBI కార్డ్‌లు మరియు Mobikwik జారీ చేసిన Amex నెట్‌వర్క్ కార్డ్‌లతో జరిపే తొలి లావాదేవీపై 20 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. అనరా బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ హోల్డర్లు వారి లావాదేవీపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.


ఐఫోన్-12 మినీ వివరాలు..


Apple iPhone 12 Mini మొబైల్ తెలుపు, నలుపు, నీలం రంగులలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. 5జీ సపోర్ట్ స్మార్ట్ ఫోన్ గా ఉన్న ఈ మొబైల్.. ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ ప్లేను అందిస్తోంది. 5.4 inches స్క్రీన్ తో, డ్యుయల్ కెమెరా సెటప్ నూ కలిగి ఉంది.


ALso Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా


ALso Read: Vishal Garg: జూమ్‌ కాల్‌ చేశాడు.. 900 మంది ఉద్యోగులను తీసేశాడు! కారణం ఏం చెప్పాడంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook