Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

Gold Price Today: బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల్ని బట్టి బంగారం ధరలు మారుతున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 7, 2021, 06:54 AM IST
  • దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర
  • దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర
  • బెంగళూరు, తెలుగు రాష్ట్రాల్లోనే బంగారం ధరలు తక్కువ
Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా

Gold Price Today: బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల్ని బట్టి బంగారం ధరలు మారుతున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారంపై పెట్టుబడి పెట్టాలంటే ఇది మంచి అవకాశమే. ఎందుకంటే గత కొద్దికాలంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్య కొద్దిగా తగ్గినా పెరిగిన శాతమే ఎక్కువగా ఉంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర, డాలర్ విలువ, వివిధ ప్రాంతాల మధ్య భౌగోళిక పరిస్థితులు, రిజర్వ్ బ్యాంకుల్లో ఉన్న బంగారం నిల్వ వంటి అంశాల ఆధారంగా బంగారం ధర ఎప్పటికప్పుడు మారుతుంటోంది. ఇప్పుడు తాజాగా ఒమిక్రాన్ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. 

దేశంలో అన్ని నగరాల కంటే ఎక్కువ ధర ఢిల్లీలో ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం(Delhi Gold Price)10 గ్రాముల ధర 46 వేల 910 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 51 వేల 170 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 510 రూపాయలుగా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 510 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 80 ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 180గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 100 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 8 వందల రూపాయలుగా ఉంది. అటు కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర 44 వేల 760 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 830 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 760 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 830 రూపాయలుగా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు(Gold Price) ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో(Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44, వేల 760 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 830 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 760 రూపాయులు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 830 రూపాయలుగా ఉంది. ఇక విశాఖలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 760 రూపాయలుగా ఉంది.

Also read: Vishal Garg: జూమ్‌ కాల్‌ చేశాడు.. 900 మంది ఉద్యోగులను తీసేశాడు! కారణం ఏం చెప్పాడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News