Ford Motor Company giving 2 Lakh Rupees on Ford Bronco Booking Cancellation: భారతదేశ మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీ కార్ల హవా నడుస్తోంది. ఎస్‌యూవీ కార్ల డిమాండ్ దృష్ట్యా ప్రతి కంపెనీ ఈ సెగ్మెంట్‌లో పలు కార్లను తీసుకొచ్చాయి. ఎస్‌యూవీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. బుకింగ్ చేసుకుంటే డెలివరీ కావడానికి చాలా కాలం వేచి ఉండాల్సి వస్తోంది. ఇది సాధారణ విషమే. అయితే ఓ కంపెనీ తన కార్ బుకింగ్‌ను రద్దు చేసుకుంటే.. డబ్బును ఆఫర్ చేస్తుందని మీరు ఎప్పుడైనా విన్నారా..? ఇది నిజం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ 'ఫోర్డ్'.. తమ కారు బుకింగ్‌ను రద్దు చేసినందుకు గానూ రూ.2 లక్షల నగదు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫోర్డ్ కంపెనీ యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) మార్కెట్‌లో 'ఫోర్డ్ బ్రోంకో' (Ford Bronco) అనే ఎస్‌యూవీని విక్రయిస్తోంది. ఈ ఎస్‌యూవీ అక్కడ చాలా ప్రజాదరణ పొందింది. పెరిగిన డిమాండ్ కారణంగా బుకింగ్ (Ford Bronco Booking) జాబితా కూడా భారీగానే ఉంది. ఫోర్డ్ బ్రోంకో ఎస్‌యూవీ యొక్క 2-డోర్ మరియు 4-డోర్ వెర్షన్‌లను 2020లో విడుదల చేసింది. అయితే ఉత్పత్తిలో జాప్యం కారణంగా.. ఫోర్డ్ సంస్థకు భారీ బకాయి ఏర్పడింది. మీడియా నివేదికల ప్రకారం.. ఫోర్డ్ మోటార్ తమ బ్రోంకో ఎస్‌యూవీ డెలివరీ కోసం వేచి ఉన్న వారందరికీ $2,500 (సుమారు రూ. 2 లక్షలు) అందిస్తోంది.


అధిక బుకింగ్ కారణంగా.. ఫోర్డ్ కంపెనీ తమ వినియోగదారులకు ఫోర్డ్ బ్రోంకో ఎస్‌యూవీలను సమయానికి డెలివరీ చేయలేకపోయింది. ఇది కాకుండా ప్రపంచ సరఫరాలో అంతరాయం కారణంగా అవసరమైన భాగాలు లేకపోవడం కూడా జాప్యానికి మరో కారణం. ఈ నేపథ్యంలో కంపెనీ ఓ నిర్ణయం తీసుకుంది. ఫోర్డ్ బ్రోంకో ఎస్‌యూవీ బుకింగ్‌ను రద్దు (Ford Bronco Booking Cancellation) చేసి.. మరొక ఫోర్డ్ కారును తీసుకుంటే $2500 రిటర్న్ చేస్తోంది.


బ్రోంకో ఎస్‌యూవీ యొక్క కొన్ని వేరియంట్లలో హై-ఎండ్ ఫీచర్లు ఇవ్వబడ్డాయి. వీటిలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 10-స్పీకర్ B&O సౌండ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ మరియు బాడీ-కలర్ హార్డ్‌టాప్‌లు ఉన్నాయి. ఇది 4X4 సౌకర్యంతో కూడా వస్తుంది. ఫోర్డ్ బ్రోంకో కోసం వెయిటింగ్ పీరియడ్ నెలలుగా నడుస్తోంది. అయితే కంపెనీ తాజా బుకింగ్ గణాంకాలు మరియు పెండింగ్ ఆర్డర్‌ల వివరాలు పంచుకోలేదు. అమెరికాలో 2 లక్షల మందికి పైగా ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకున్నారని ఫోర్డ్ ఓ ప్రకటలో తెలిపింది.


Also Read: Itel A24 Pro: 5 వేల లోపే సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కిపోద్ది! గుడ్ లుకింగ్   


Also Read: హ్యుందాయ్ క్రెటాకు పోటీగా.. టాటా, మహీంద్రాల కొత్త ఎస్‌యూవీలు! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500కిమీ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి