Free Ola Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై 202 కి.మీ. ప్రయాణించిన వ్యక్తికి మరో స్కూటర్ గిఫ్ట్!
Free Ola Scooter: ఎన్నో అనూహ్య సంఘటనలు, వ్యతిరేకతల తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. కార్తిక్ అనే ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్క ఛార్జ్ తో 202 కి.మీ. ప్రయాణించినట్లు ట్వీట్ చేశాడు. దీనిపై ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈఓ భావిష్ అగర్వాల్ ఊహించని గిఫ్ట్ అందించాడు.
Free Ola Scooter: అనేక బ్రేక్‌డౌన్ సంఘటనలు, బ్యాటరీ ఫైర్, సాఫ్ట్‌వేర్ బగ్‌ల తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి ఎట్టకేలకు సంతోషకరమైన విషయం బయటకు వచ్చింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 ప్రో కొనుగోలు చేసిన కార్తిక్ అనే వ్యక్తి.. తన ఎలక్ట్రిక్ బైక్ గురించి సంతోషకరమైన వార్తను ట్విట్టర్ లో పంచుకున్నాడు. సింగిల్ ఛార్జింగ్ తో తన ఓలా ఎస్1 202 కి.మీ. ప్రయాణించినట్లు పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన కిలో మీటర్ రీడింగ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై Ola ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈఓ భావిష్ అగర్వాల్ స్పందించారు.
Ola S1 ప్రో యజమాని కార్తిక్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిత్రం ప్రకారం.. తన ఓలా ఎలక్ట్రిక్ బైక్ గంటకు 27 కి.మీ. సగటు వేగంతో 202 కి.మీ. ప్రయాణించినట్లు తెలుస్తోంది. అందులో గరిష్టంగా తాను గంటకు 48 కి.మీ వేగంతో ప్రయాణించినట్లు అందులో ఉంది. అయితే తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను ECO మోడ్ లో ఉపయోగించి.. 202 కి.మీ. లలో సగం ట్రాఫిక్, సగం హైవేపై ప్రయాణించినట్లు ఆయన తెలిపాడు.
దీనిపై ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ, భావిష్ అగర్వాల్ కార్తీక్ ట్విట్టర్ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో కార్తిక్ ఓ విప్లవాన్ని సృష్టించాడని ఆయన అన్నాడు. Ola S1లో ఒకే ఛార్జ్‌లో 200 కి.మీ. ప్రయాణించడంపై భావిష్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశాడు. అయితే ముందుగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం.. ఈ ఘనత సాధించిన విధంగా కొత్త గెరువా కలర్ లో ఓలా ఎస్1 ప్రోని బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపాడు.
ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా నిలిచింది. ఏప్రిల్ 2022లో Ola ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా 12,683 యూనిట్ల S1 ప్రో స్కూటర్‌లను విక్రయించింది. ఈ క్రమంలో దేశంలో నంబర్ 1 EV తయారీదారుగా హీరో ఎలక్ట్రిక్‌ను అధిగమించింది.
Also Read: Saudi Arabia: భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన సౌదీ అరేబియా ప్రభుత్వం
Also Read: YouTube New Features: యూట్యూబ్ యూజర్లకు శుభవార్త.. మరో రెండు ఫీచర్లు అందుబాటులో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook