రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యుడి బెంబేలెత్తిపోతున్నాడు. అటు ఇంధన ధరలు, ఇటు వంట గ్యాస్ ధర పెరిగిపోతోంది. అదే సమయంలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు కూడా పెరుగుతున్నాయి. గుజరాత్ గ్యాస్ సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరల్ని పెంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎన్జీ, పీఎన్జీ ధరలు 5 శాతం పెరిగాయి. గుజరాత్ రాష్ట్రంలో కిలో సీఎన్జీ గ్యాస్ 78.52 రూపాయలవుతుంది. పీఎన్జీ గ్యాస్ అయితే కిలోకు 50.43 రూపాయలుంటుంది. దీంతోపాటు జనవరి 1 నుంచి గ్యాస్ సిలెండర్ ధరలు కూడా పెరిగాయి. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు జనవరి 1, 2023 నుంచి కమర్షియల్ సిలెండర్ ధరల్ని పెంచేశాయి. ప్రతి కమర్షియల్ సిలెండర్ ధర 25 రూపాయలవరకూ పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో కమర్షియల్ సిలెండర్ ధర 1769 రూపాయలు కాగా, ముంబైలో 1721 రూపాయలుంది. కోల్‌కతాలో 1870 రూపాయలుంటే, చెన్నైలో 1917 రూపాయలుంది.


డొమెస్టిక్ గ్యాస్ ధరలో పెరుగుదల


అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరలో ఏ విధమైన మార్పు రాలేదు. ఇవాళ కూడా డొమెస్టిక్ గ్యాస్ ధర స్థిరంగానే ఉంది. ఢిల్లీలో సిలెండర్ ధర 1053 రూపాయలు కాగా, ముంబైలో 1052.5 రూపాయలుంది. కోల్‌కతాలో 1079 రూపాయలు కాగా, చెన్నైలో 1068.5 రూపాయలుంది. 


Also read: Share Market: ఈ ఏడాది ఐపీవో లాంచ్ చేయనున్న ప్రఖ్యాత కంపెనీలు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook