Electric scooters: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర వంద దాటేసింది. పెట్రో ధరలు అంతకంతకూ పెరుగుతుండంతో ప్రజలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఫలితంగా ఈ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇంధన దరల (Fuel prices) గురించే చర్చ సాగుతోంది. రోజురోజుకూ పెట్రో, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటేయగా..మరి కొన్ని రాష్ట్రాల్లో వంద రూపాయలకు చేరువలో ఉంది. పెట్రో భారం మోయలేక ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఫలితంగా గత కొద్దిరోజులుగా ప్రజలు ఈ సైకిళ్లు, ఈ స్కూటర్లు, ఈ రిక్షాల వైపు మొగ్గు చూపుతున్నారు. పంజాబ్‌లోని లూథియానా సైకిల్ ఫ్యాక్టరీలకు ఫ్యామస్. పెట్రో ధరల పెరుగుదలతో ఈ సైకిళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. గత రెండు నెలల్లోనే ఈ సైకిళ్ల అమ్మకాలు పది నుంచి పదిహేను శాతం వరకూ పెరిగింది. వచ్చేవారం నుంచి ఈ బైక్స్ ఉత్తరాదిలో అందుబాటులో ఉంటాయని ఎవాన్  సైకిల్స్  ఎండీ తెలిపారు. నగరాల్లో భారీగా పెరుగుతున్న ట్రాఫిక్ కూడా ఈ బైక్ విక్రయాలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది.


ఈ బైక్స్ అమ్మకాల్లో వంద శాతం వృద్ధిని అందుకుంటామని హీరో సైకిల్స్ అంచనా  వేస్తోంది. గత యేడాది 30 వేల సైకిళ్లు విక్రయించినట్టు సంస్థ తెలిపింది. ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో అమ్మకాలుంటాయని చెప్పింది. మరోవైపు గత 2-3 నెలలుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఎంక్వైరీలు వస్తున్నాయని వాహన సంస్థలు తెలిపాయి. దగ్గరి దూరాలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు( Electric Scooters) అనువుగా ఉండటమే కాకుండా పెట్రో ధరల్నించి విముక్తి  పొందాలనే ఉద్దేశ్యంలో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. 


Also read: Platform Ticket Price: ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధర ఏకంగా రూ.50కి పెంచారు, కారణమేంటో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook