Fuel Saving Hacks: పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేశాయి. పెరిగిన ఇంధన ధరలతో కారు బయటకు తీయాలంటే సమస్యగా మారుతోంది. కొన్ని టిప్స్ పాటిస్తే..మీ కారు మైలేజ్ పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంధన ధరల పెరగుదలతో సామాన్య మానవుడు కారు బయటకు తీయాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో కాస్త తగ్గినా..ఇప్పటికీ వందకు పైనే ఉన్నాయి ధరలు. కారు మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా మారిన పరిస్థితి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో నెలంతా కారు నడిపితే జేబుకు చిల్లు పడినట్టే ఇక. అందుకే కొన్ని సులభమైన టిప్స్ పాటించడం ద్వారా కారు పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవచ్చు. 


వేసవి కాలంలో ఏసీ అవసరం తప్పదు. అందుకే కారు కేబిన్ ఒకసారి కూల్ ఎక్కిన తరువాత ఏసీ ఆఫ్ చేసే అలవాటు చేసుకోవాలి. కంటిన్యూగా ఏసీ ఆన్‌లో పెట్టకుండా ఇలా చేయడం వల్ల ఇంధనం ఆదా చేయవచ్చు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద కూడా చాలామంది కారు ఇంజన్ ఆన్‌లోనే ఉంచుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పర్యావరణపరంగా, అటు ఇంధనం ఆదా పరంగా ట్రాఫిక్ జంక్షన్ల వద్ద 10 సెకన్లకంటే ఎక్కువే నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో ఇంజన్ ఆఫ్ చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల కన్పించని ఇంధనం ఆదా అవుతుంది. 


కారులో ఎక్కువ బరువు లేకుండా చూసుకోవాలి. ఇంజన్‌పై బరువు కారణంగా ఎక్కువ ఒత్తిడి పడితే..ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అందుకే ఎప్పుడూ కారులో అనవసరమైన యాక్సెసరీస్‌తో బరువు పెంచేయకుండా చూసుకోవాలి. కారులో అనవసరమైన డెకొరేటివ్ ఐటమ్స్ కూడా మీ కారు ఇంజన్‌పై ఒత్తిడి పెంచుతాయి. అందుకే మైలేజ్ ఎక్కువగా రావాలంటే..అనవసరమైన సామాన్లు ఉండకూడదు.


ఒకవేళ కారు ఉత్తత్తి చేసిన కంపెనీ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఇస్తే..దానిని వాడుతుండాలి. దీనివల్ల కారు నిర్ణీత వేగంతో నడుస్తుంటుంది. మైలేజ్ మెరుగవుతుంది. అంతేకాకుండా డ్రైవర్‌కు కాస్త విశ్రాంతి లభిస్తుంది. ఈ ఫీచర్ సుదూర ప్రయాణాల్లో ఉపయోగపడుతుంది. కారు ఎయిర్ ఫిల్టర్ సరిగా పనిచేయకపోతే ఇంజన్‌పై ప్రభావం పడుతుంది. ఫలితంగా పరోక్షంగా మైలేజ్ తగ్గడానికి కారణమౌతుంది. అందుకే కారు ఫిల్టర్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. 


ఇక మరో ముఖ్యమైన సూచన కారు టైర్ల విషయంలో. మీ కారుకు ఉద్దేశించిన టైర్లు వాడితే అది కూడా మేలేజ్‌పై ప్రభావం చూపిస్తుంది. లోయర్ టైర్ ప్రెషర్ కారణంగా ఇంజన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే టైర్ ప్రెషర్ ఎప్పుడూ సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. 


Also read: Gold Price Today: స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధర.. ఆయా నగరాల్లో ధరల వివరాలివే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook