Tees Maar Khan Teaser: ఏ పాప.. మరీ ఇంత పబ్లిక్‌లో ఎలా! ఇంట్లో అయితే బాగుంటుంది కదా..

Tees Maar Khan Teaser Released. ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన తీస్‌ మార్‌ ఖాన్‌ సినిమా టీజ‌ర్‌ను నేడు చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2022, 02:47 PM IST
  • ఏ పాప.. మరీ ఇంత పబ్లిక్‌లో ఎలా
  • ఇంట్లో అయితే బాగుంటుంది కదా
  • ఆకట్టుకునేలా తీస్‌ మార్‌ ఖాన్‌ టీజర్‌
Tees Maar Khan Teaser: ఏ పాప.. మరీ ఇంత పబ్లిక్‌లో ఎలా! ఇంట్లో అయితే బాగుంటుంది కదా..

Tees Maar Khan movie Teaser Released: 'ప్రేమకావాలి' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్‌.. మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. లవ్లీ, సుకుమారుడు వంటి యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీతో కెరీర్‌ ఆరంభంలోనే వరుస హిట్స్‌ అందుకున్నాడు. ఆపై వచ్చిన రఫ్, గరం, చుట్టాలబ్బాయి, నెక్స్ట్ నువ్వే, బుర్రకథ, జోడి లాంటి సినిమాలతో వరుస పరాజయాలు అందుకున్నాడు. శశి సినిమాతో పర్వాలేదనిపించిన ఆది.. మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే విభిన్న కథాంశంతో వచ్చిన 'నాటకం' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో 'తీస్‌ మార్‌ ఖాన్‌' చేస్తున్నాడు. 

లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న తీస్‌ మార్‌ ఖాన్‌ సినిమాలో ఆది.. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని విజ‌య్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తిరెడ్డి నిర్మించారు. సునీల్‌, పూర్ణ‌, క‌బీర్ దుహ‌న్ సింగ్ కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు.  క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమా జూలై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News