Share Market: ఈ వారం ప్రారంభం నుంచి  ప్రైమరీ మార్కెట్లో ఏకంగా ఏడు ఐపీవోలు అడుగు పెడుతున్నాయి. ఈ వారం ఐపీవో మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఏకంగా ఆగస్ట్ 19 నుండి వారం రోజుల పాటు  సుమారు 7 IPOలు మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో 2 మెయిన్‌బోర్డ్ సెగ్మెంట్ IPOలు కాగా 5 SME సెగ్మెంట్ IPOలు కావడం విశేషం. ఆగస్ట్ 19 నుండి ప్రారంభమయ్యే వారంలో వచ్చే రెండు మెయిన్‌బోర్డ్ IPOల పేర్లు ఇంటరార్క్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (Interarch Building Products Limited IPO), ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ Orient Technologies IPO. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రెండు మెయిన్‌బోర్డ్ విభాగాలు కాకుండా, 5 SME సెగ్మెంట్ IPOల పేర్లలో బ్రేస్ పోర్ట్ లాజిస్టిక్స్ లిమిటెడ్, ఫోర్కాస్ స్టూడియో లిమిటెడ్, QVC ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ఐడియల్ టెక్నోప్లాస్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ లిమిటెడ్ ఉన్నాయి. ప్రస్తుతం రెండు ఐపీవోల గురించి తెలుసుకుందాం..


ఇంటరార్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ IPO (Interarch Building Products Limited IPO): 


ప్రీ-ఇంజనీరింగ్ స్టీల్ బిల్డింగ్ కంపెనీ ఇంటరార్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ IPO ఆగస్ట్ 19న ప్రారంభమై ఆగస్ట్ 21న ముగుస్తుంది. ఇంటరార్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ IPO ద్వారా రూ.600.29 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. IPO ద్వారా నిధులను సేకరించేందుకు కంపెనీ 6,669,852 షేర్లను జారీ చేసింది. ఇంటరార్క్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ IPO ధర బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.850-900గా నిర్ణయించబడింది. IPO లాట్ పరిమాణం 16 షేర్లు. అంటే రిటైల్ ఇన్వెస్టర్ కనీసం 16 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది మినిమం రూ.14,400 ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఐపీవో లిస్టింగ్ తేదీ 26 ఆగస్టు 2024గా నిర్ణయించారు. 


Also Read : Gold price Today: రాఖీపండగ వేళ.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు


ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ IPO (Orient Technologies IPO):


ముంబైకి చెందిన IT సొల్యూషన్స్ కంపెనీ ఓరియంట్ టెక్నాలజీస్  IPO ఆగస్టు 21న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. అలాగే ఈ ఇష్యూ ఆగస్టు 23న ముగుస్తుంది. ఐపీఓ ద్వారా రూ.214.76 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందుకోసం ఐటీ కంపెనీ 10,425,243 షేర్లను జారీ చేసింది. ఈ IPO ప్రైస్ బ్యాండ్ చూస్తే ఒక్కో షేరుకు రూ.195-206గా నిర్ణయించారు. రిటైల్ పెట్టుబడిదారులకు కనీస లాట్ పరిమాణం 72 షేర్లకు బిడ్ దాఖలు చేయాలి. అంటే ఒక ఇన్వెస్టర్ కనీసం రూ.14,832 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓరియంట్ టెక్నాలజీస్ IPO షేర్ల లిస్టింగ్ తేదీ 26 ఆగస్టు 2024 నిర్ణయించారు.


Also Read : Best FD Rates: ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ అందించే టాప్ 7 బ్యాంకులు ఇవే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook