Best FD Rates: షేర్ మార్కెట్ లేదా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెద్దమొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. అయితే సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటే ప్రత్యామ్నాయం. ఎందుకంటే కొన్ని బ్యాంకులు అత్యధికంగా 9.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నాయి. అదే విధంగా చిన్న తరహా బ్యాంకులు ఇతర బ్యాంకుల కంటే అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సి, యాక్సిస్ వంటి బ్యాంకుల కంటే చిన్న తరహా బ్యాంకులే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి. ఈ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఏకంగా 9.5 శాతం వడ్డీ అందిస్తున్నాయి.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం దేశంలోనే అత్యధిక వడ్డీ ఇస్తోంది. 3 ఏళ్ల కాల వ్యవధిపై ఈ బ్యాంకు 9.5 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
ఇక సూర్య స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే దేశంలో రెండో స్థానంలో ఉంది. ఈ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 9.1 శాతం వడ్డీ అందిస్తోంది. అది కూడా మూడేళ్ల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై ఇస్తోంది
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా మూడేళ్ల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 9.1 శాతం వడ్డీ చెల్లిస్తోంది. మరో బ్యాంకు సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది కూడా అదే వడ్డీ అందిస్తోంది. అంటే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకే వడ్డీ ఇస్తున్నాయి.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 8.75 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా మూడేళ్ల కాల పరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 8.5 శాతం వడ్డీ ఇస్తున్నాయి. ఇక చివరిగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల కాలపమితిపై 8 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
Also read: VIVO Y300 Series: వివో నుంచి త్వరలో 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో సూపర్ ఫోన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook