Garlic Price Today: నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముందు టామోట ధరలు చుక్కలు చూపించాయి. ఏకంగా కిలో టమోట రూ.300 పైగా పలికింది. టమోట ధర తగ్గగానే ఉల్లి వంతు వచ్చింది. చాలా రోజుల క్రితమే పెరిగిన ఉల్లి ధరలు ఇంకా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం కిలో ఉల్లి సగటు ధర 57 రూపాయలుగా ఉంది. జనవరి నెల వరకు ఉల్లి ధరలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోకే కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో వచ్చే ఏడాది మార్చి నెల వరకు ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది. ఉల్లి ధరలు మండుతుండగా.. వెల్లుల్లి ధరలు కన్నీళ్లు తెప్పించేందుకు రెడీ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఉల్లి తరువాతవెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటాయి. రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధర కిలో రూ.300 నుంచి రూ.400కి చేరడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెల్లుల్లి ధరలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయని.. భవిష్యత్‌లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది వెల్లుల్లి సరఫరా తగ్గిపోవడంతో భారీగా డిమాండ్ పెరిగింది. ముంబై నుంచి హోల్‌సేల్ వ్యాపారులు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వెల్లుల్లిని కొనుగోలు చేస్తున్నారు. లాజిస్టిక్స్ ఖర్చులు, ఇతర స్థానిక ఛార్జీలను పెంచడంతో వెల్లుల్లి ధరలపై భారీ ప్రభావం చూపుతోంది. గత కొన్ని వారాలుగా వెల్లుల్లి కొరత కారణంగా ధర క్రమంగా పెరుగుతోంది.


వెల్లుల్లి ధరలు కూడా ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశ లేదని వ్యాపారులు భావిస్తున్నారు. గత నెలలో కిలో రూ.100-150కి పైగా విక్రయించగా.. ప్రస్తుతం రూ.150 నుంచి 250 మధ్య పలుకుతున్నాయి. కాగా.. కిలో రిటైల్ మార్కెట్‌లో కిలో వెల్లుల్లి ధర రూ.300 నుంచి రూ.400కి పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లో వెల్లుల్లి రాక బాగా తగ్గిపోయింది. గతంలో రోజుకు 25 నుంచి 30 వాహనాలు వెల్లుల్లి తీసుకురాగా.. ప్రస్తుతం 15 నుంచి 20 వాహనాలు వస్తున్నాయని అంటున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి వెల్లుల్లి సరఫరా దాదాపు ఆగిపోయిందని.. ఊటీ, మలప్పురం నుంచి తగ్గుదల ఏర్పడిందని ఏపీఎంసీ వ్యాపారులు తెలిపారు. 


ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వెల్లుల్లి పంట తగ్గడం ఒక కారణం కాగా.. అక్టోబరు, నవంబర్‌లో కురిసిన అకాల వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో వెల్లుల్లి పంటలు నాశనమయ్యాయి. దీంతో కొత్త పంట మార్కెట్‌కు వచ్చేందుకు సమయం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అప్పటివరకు వెల్లుల్లి ధరలు తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.


Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి