Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర
LPG Gas Cylinder Prices: ఒకటో తేదీ గ్యాస్ ధరలు తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింట్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.99.75 తగ్గించగా.. డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం యథావిధిగా ఉన్నాయి. లేటెస్ట్ గ్యాస్ ధరలు ఇలా..
LPG Gas Cylinder Prices: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట కలిగించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ ప్రకటన చేశాయి. 19 కేజీ వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.99.75 తగ్గించాయి. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నాయి. తగ్గించిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తున్నాయి. 19 కేజీ కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రేట్లు జూలైలో చివరిసారిగా సవరించగా.. పన్నులను బట్టి ఒక్కో రాష్ట్రానికి ధరలు మారే అవకాశం ఉంది. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ విక్రయ ధర 1,680 రూపాయలకు తగ్గింది.
నేటి నుంచి ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రిటైల్ విక్రయ ధర రూ.1,680, కోల్‌కతా రూ.1,802, ముంబై రూ.1,640, చెన్నై రూ.1,852.50, హైదరాబాద్ 1,918.00 రూపాయలకు అందుబాటులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దేశీయ ఎల్‌పీజీ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే.
గృహ వినియోగదారుల సిలిండర్ ధరలు మాత్రం యథావిధిగా కొనసాగించాయి. 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లను సవరించలేదు. డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలను చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న సవరించాయి. సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103, కోల్‌కతాలో రూ.1,129, ముంబైలో రూ.1,102.50, చెన్నైలో రూ.1,118.50, హైదరాబాద్‌లో రూ.1155, ఏపీలో రూ.1161 వద్ద కొనసాగుతున్నాయి. ఈసారి డొమెస్టిక్ సిలిండర్లు ధరలు తగ్గిస్తారని గృహ వినియోగదారులు అంచనా పెట్టుకోగా.. ఆ దిశగా అడుగులు పడలేదు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గ్యాస్ ధరలు తగ్గుతాయని ఆశలు ఉన్నాయి.
Also Read: JC Prabhakar Reddy: ఆ రోజు ఉరి వేసుకుందామనుకున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి
Also Read: Weather Updates Today: రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి