Go First Airline: గో ఫస్ట్ ఎయిర్‌లైన్ దివాల. రెండు రోజులు విమానాలు రద్దు
Go First Declares Bankruptcy: తీవ్ర ఆర్థిక నష్టాలతో రెండు రోజులు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది గో ఫస్ట్ ఎయిర్ లైన్. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు. ఈ విషయంపై డీజీసీఏ నోటిసులు జారీ చేసింది.
Go First Declares Bankruptcy: గో ఫస్ట్ ఎయిర్‌లైన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో మూడో అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా ఉన్న గోఫస్ట్.. దివాల దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ లా ట్రిబ్యునల్ ముందు మంగళవారం దివాల పిటిషన్ దాఖలు చేసింది. అదేవిధంగా మే 3, 4వ తేదీల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎయిర్‌లైన్స్ చీఫ్ కౌశిక్ ఖోనా వెల్లడించారు. దేశంలో 27 నగరాలకు.. 7 అంతర్జాతీయ నగరాలకు గో ఫస్ట్ విమాన సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు విమానాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తరుణంలో పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎలాంటి సమాచారం లేకుండానే ఎలా విమాన సర్వీసులు రద్దు చేస్తారని ప్రశ్నించింది. నిర్ణీత షెడ్యూల్‌ను అనుసరించడంలో గోఫస్ట్ విఫలమైందని.. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంది. గోఫస్ట్ నిర్ణం ఇది షెడ్యూల్ ఆమోదానికి విరుద్ధంగా నోటీసుల్లో తెలిపింది.
ఎందుకు ఈ సంక్షోభం..?
గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌కు అమెరికా సంస్థ అయిన ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ నుంచి విమానాల ఇంజిన్ల సరఫరాలో ఇంజిన్‌ల సరఫరాలో జాప్యం చేసింది. దీంత తన విమానాల్లో సగానికిపైగా అంటే 28 విమానాలను గో ఫస్ట్ ఎయిర్‌లైన్ నిలిపివేసింది. విమానాలను పక్కనబెట్టడంతో సంస్థకు నిధుల కొరత తలెత్తింది. ప్రాట్ అండ్ విట్నీ సరైన సమయంలో ఇంజిన్లు సరఫరా చేయకపోవడంతోనే ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని సీఈఓ కౌశిక్ ఖోనా వెల్లడించారు.
దివాల కోసం దరఖాస్తు చేయడం దురదృష్టకర నిర్ణయమని.. అయితే కంపెనీ ప్రయోజనాలను కాపాడేందుకు ఇలా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ పరిణామాలను విమానయాన సంస్థ ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. దీంతో పాటు డీజీసీఏకు వివరణాత్మక నివేదికను సమర్పించనున్నారు.
మే 3, 4 తేదీల్లో ఎయిర్‌లైన్ విమానాలు నిలిపివేస్తున్నట్లు ఖోనా తెలిపారు. ఆ తరువాత విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయన్నారు. అయితే విమానాలను రద్దు చేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూలై 2022లో గోఫస్ట్ తన విమానాలను మొదటిసారిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కంపెనీ షేర్లు మార్కెట్లో నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి.
గతేడాది మేలో కంపెనీ మార్కెట్ వాటా 11.1 శాతంగా ఉంది. అప్పుడు 12.7 లక్షల మంది ప్రయాణికులు గోఫస్ట్ విమానాల్లో ప్రయాణించారు. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 21.8 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. డీజీసీఏ ఇచ్చిన నోటిసులకు 24 గంటల్లోగా గో ఫస్ట్ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మే 5 నుంచి విమానాల షెడ్యూల్ వివరాలను కూడా విమానయాన సంస్థలకు అందజేయాలి.
Also Read: Indore Crane Accident: ఘోర విషాదం.. క్రేన్ కింద పడి నలుగురు దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి