Amrapali kata on leave in Andhra Pradesh: తెలంగాణలో పనిచేస్తున్న కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ లు ఇటీవల ఏపీకి కేటాయిస్తు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తు సందరు అధికారులు.. హైకోర్టు, క్యాట్ లలో కూడా పిటిషన్ లు వేశారు. కానీ వీరికి ఎక్కడ కూడా ఉపశమనం దొరకలేదు. చివరకు అధికారులు చేసేదిలేక.. ఏపీకి వెళ్లి రిపోర్టు చేసుకున్నారు. అయితే.. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన డైనమిక్ అధికారిణి ఆమ్రపాలీ కాట మాత్రం తెలంగాణలో పనిచేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపారు. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు వీరికి చంద్రబాబు సర్కారు ఎలాంటి బాధ్యతలు కేటాయించకుండా హోల్డ్ లోనే ఉంచింది.
కొన్ని రోజుల క్రితమే ఏపీ సర్కారు మాత్రం.. ఆమ్రపాలీ కాటకు టూరిజం శాఖ ఎండీగా కీలక బాధ్యతలు అప్పగించింది. అంతే కాకుండా.. ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా కూడా పూర్తి అదనపు బాధ్యతల్ని కూడా అప్పగించింది. ఈ క్రమంలో ఆమ్రపాలీ కాట.. టూరిజం శాఖలో బాధ్యతలు సైతం స్వీకరించారు. చంద్రబాబు సర్కారు.. ఆమ్రపాలీకి కీలక శాఖను కేటాయించినట్లు తెలుస్తొంది.
గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆమ్రపాలీ.. అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుని వరదల నియంత్రణలో తనదైన మార్కు చూపించారు. అందుకే ఆమ్రపాలీకి చంద్రబాబు సర్కారు ఏపీ టూరిజం శాఖ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఆమ్రపాలీ కాట.. ఈనెల 6న బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆమ్రపాలీ అనూహ్యంగా సెలవులపై వెళ్లిపోయినట్లు తెలుస్తొంది.
ఆమ్రపాలి బాధ్యతల్ని విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమ్రపాలీ వ్యక్తిగత కారణలపై పదిరోజుల పాటు సెలవులు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమ్రపాలీ సెలవులపై వెళ్లడం ప్రస్తుతం చర్చగా మారింది. మళ్లీ వచ్చి ఆమె విధుల్లో చేరుతారో లేదా మరేలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.