Go First: దేశవ్యాప్తంగా కరోనా భయాలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ భయాలు ఆందోళన (Omicron scare) కలిగిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కొవిడ్​ థార్డ్​ వేవ్ (Covid Third wave)​ రావచ్చని అంచనాలు ఆందోళనలను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా కట్టడిలో భాగంగా పలు ప్రైవేటు సంస్థలు కూడా వినూత్నంగా తమ వంతు సహాయం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ 'గో ఫస్ట్​' సరి కొత్త ఆఫర్​ను (Go first special offer) ప్రకటించింది.


రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ (Corona vaccine) తీసుకున్న దేశీయ ప్రయాణికులు.. టికెట్ ఛార్జీలపై 20 శాతం వరకు డిస్కాంట్​​ పొందొచ్చని తెలిపింది.


ఆఫర్ పూర్తి వివరాలు ఇలా..


రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని దేశీయంగా ప్రయాణించాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ ఆఫర్​ వర్తిస్తుందని గో ఫస్ట్​ స్పష్టం చేసింది.


ఆఫర్​పై టికెట్ బుక్​ చేసుకున్న ప్రయాణికులు.. బుకింగ్​ తేదీ నుంచి 15 రోజుల తర్వాతే ప్రయాణ తేదీని ఎంచుకోవచ్చని తెలిపింది. ఎవరైతే ఈ ఆఫర్​ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటారో వారు ప్రయాణ తేదీ రోజు ప్రభుత్వం జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్​ను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆరోగ్య సేతు యాప్​లో కూడా వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​ను చూపించొచ్చని వెల్లడించింది.


తమ వినియోగదారులందరి భద్రతకు కట్టుబడి ఉన్నామని.. ఇందులో భాగంగానే తమ సిబ్బంది అందరికి ఇప్పటికే టీకా కార్యక్రమం పూర్తయినట్లు వెల్లడించింది గో ఫస్ట్​. ఇప్పుడు ఇతరులను కూడా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్​ ప్రకటించినట్లు వివరించింది.


మరో బడ్జెట్ విమానయనాన సంస్థ ఇండిగో కూడా.. ఇప్పటికే ఇలాంటి ఆఫర్​ను ప్రకటించడం గమనార్హం. వ్యాక్సిన్​ తీసుకున్న వారికి ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఇంతకు ముందే ఇండిగో ప్రకటించింది.


Also read: Flipkart Bumper Offer: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 42 ఫోన్ కేవలం 5 వేలకే..మరి కొద్దిగంటలే మిగిలింది


Also read: 2021 Electric Vehicles: దేశంలో 25 లక్షలకు దిగువన అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook