Flipkart Bumper Offer: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 42 ఫోన్ కేవలం 5 వేలకే..మరి కొద్దిగంటలే మిగిలింది

Flipkart Bumper Offer: స్మార్ట్‌ఫోన్ తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే త్వరపడండి. 5జీ స్మార్ట్‌ఫోన్లపై ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన బంపర్ ఆఫర్ మరి కాస్సేపట్లో ముగుస్తోంది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 21, 2021, 02:11 PM IST
Flipkart Bumper Offer: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 42 ఫోన్ కేవలం 5 వేలకే..మరి కొద్దిగంటలే మిగిలింది

Flipkart Bumper Offer: స్మార్ట్‌ఫోన్ తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే త్వరపడండి. 5జీ స్మార్ట్‌ఫోన్లపై ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన బంపర్ ఆఫర్ మరి కాస్సేపట్లో ముగుస్తోంది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.

5 జీ స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే త్వరపడండి. ఎందుకంటే ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్(Flipkart Bumper Offer)ప్రకటించిన బంపర్ ఆఫర్ ఇవాళ్టితో అంటే డిసెంబర్ 21తో ముగుస్తోంది. మరి కొద్దిగంటలు మాత్రమే మిగిలింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ డిసెంబర్ 16 నుంచి ప్రారంభమైంది. ఇవాళ్టితో ముగియనుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 42ను భారీ డిస్కౌంట్, భారీ ఎక్స్చేంజ్‌తో అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్(5G Smartphone)ధర 20 వేల 999 రూపాయలుండగా, డెబిట్, క్రెడిట్ కార్టు ద్వారా కొనుగోలు చేస్తే 3 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే కేవలం 17 వేల 999 రూపాయలకే మీరు ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అదే సమయంలో మీ పాత ఫోన్‌పై 15 వేల 450 రూపాయల భారీ ఎక్స్చేంజ్ పొందవచ్చు. అంటే ఎక్స్చేంజ్ కింద మీ పాత ఫోన్ ఇస్తే..ఎక్స్చేంజ్ వ్యాల్యూ 15 వేల 450 రూపాయలు మినహాయించుకుని కేవలం 5 వేల 549 రూపాయలకే శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. అద్భుతమైన ఈ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 42 (Samsung Galaxy f42)ఫోన్‌లో 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ ఉంటుంది. మీడియా టెక్ డైమెన్షన్‌తో రూపుదిద్దుకున్న ఈ ఫోన్‌లో 7 హండ్రెడ్ ప్రోసెసర్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్, 5 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమేరా సౌకర్యముంది. ఈ ఫోన్ పై ప్రత్యేక ఆఫర్ పొందడానికి మరికొద్ది గంటలే మిగిలుంది.

Also read: Stock Market today: స్టాక్ మార్కెట్లపై బేర్​ పంజా- 56 వేల మార్క్​ కోల్పోయిన సెన్సెక్స్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News