Gold Price will reach Rs 65000 By Diwali 2023, Silver Price will be Rs 80000: భారత దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 2022 నవంబర్ మాసంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800లుగా ఉండగా.. ఇప్పుడు రూ. 52,400లుగా ఉంది. దాదాపుగా రూ. 6 వేల రూపాయలు పెరిగింది. ఆగస్ట్ 2020 రికార్డు ధర కంటే బంగారం ధర ప్రస్తుతం ఎక్కువగా ఉంది. అదే విధంగా కిలో వెండి ధరపై 6 నుంచి 7 వేలు పెరిగింది. అయితే రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 65000లుగా ఉంటుందని గ్రీన్ పోర్ట్‌ఫోలియో స్మాల్‌కేస్ సహ వ్యవస్థాపకుడు దివం శర్మ అంచనా వేశారు. అలానే కిలో వెండి రూ. 80000లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. దివం శర్మ అంచనా ప్రకారం... 10 గ్రాముల బంగారంపై రూ. 15 వేలు, కిలో వెండిపై దాదాపుగా 10 వేలు పెరగనున్నాయి. బంగారం మరియు వెండి భారీగా పెరగడానికి గల ప్రధాన కారణాలను ఓసారి చూద్దాం. 


ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకోవడం, నిరుద్యోగ రేటు పెరగడం వలన బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని దివం శర్మ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా గత ఏడాది కాలంలో ద్రవ్యోల్బణంను ఎదుర్కొన్నాయి. అమెరికాలో ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థలో మాంద్యం మరింత దిగజారే అవకాశం ఉందట. గత సంవత్సరంలో ఉక్రెయిన్ యుద్ధం ఆంక్షల కారణంగా రష్యా, యూఎస్ డాలర్ నిల్వలు తగ్గాయి. తమ డాలర్ నిల్వలపై ప్రమాదాన్ని తగ్గించాలని చూస్తున్నాయి. బంగారం దానికి సరైన రీ-ప్లేస్‌మెంట్. ప్రపంచంలోని చాలా దేశాలు తమ బంగారం నిల్వలను పెంచుకోవడానికి ఇదే కారణం. బంగారం డిమాండ్ పెరగడానికి ఇదే ప్రధాన కారణం.


చైనా, రష్యాలు బంగారాన్ని వేగంగా పోగు చేస్తున్నాయి. రిజర్వ్ కరెన్సీతో బంగారాన్ని కొంటున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. రష్యా తన కరెన్సీ విలువను బలోపేతం చేయడానికి క్రిప్టో కరెన్సీని కూడా పరిశీలిస్తోంది. దీనికి బంగారం మద్దతు ఉంటుంది. కరోనా వైరస్ లాక్ డౌన్ అనంతరం చైనాలో పారిశ్రామిక కార్యకలాపాలు పునరుద్ధరణ అవుతున్నాయి. దాంతో బంగారం, వెండి కాకుండా.. ఉక్కు, జింక్, అల్యూమినియం తదితర వస్తువుల ధరలు కూడా రానున్న కాలంలో ప్రభావితం కానున్నాయి. ఇక పెట్టుబడిదారులు తమ పెట్టుబడి మొత్తం బంగారంపైనే పెట్టారు. ఇవన్నీ బంగారం పెరగడానికి అసలు కారణాలు. 


Also Read: Shreyas Iyer: రెండో టెస్టుకు ముందు భారత్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!


Also Read: Taraka Ratna Biography : ఇంకా బెడ్డు మీదే తారకరత్న.. నెటిజన్లు వెతికేది మాత్రం ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.