Gold Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి కొనుగోలుదారులకు షాకిచ్చాయి గోల్డ్ రేట్స్. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం రూ.150 నుంచి రూ.170 వరకు పెరిగింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000కు వేలకు లభిస్తుండగా.. 24 క్యారెట్లు రూ.51,280గా ఉంది. బంగారం దారిలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండిపై రూ.100 మేర పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 58,100 గా ఉంది. ఇక కిలో వెండి హైదరాబాద్ లో రూ.63, 200, విజయవాడలో రూ.64, 500గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. ఈ ధరలు ఇవాళ ఉదయం ఆరు గంటలకు నమోదైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
>> ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,430 ఉంది.
>> ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 పలుకుతోంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. 


తెలుగు రాష్ట్రాల్లో...
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 280 ఉంది.


Also Read: EPF Account Update: పీఎఫ్ ఎక్కౌంట్ ఎలా బదిలీ చేయాలో తెలుసా 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook