Gold And Silver Rates: గత కొన్నేళ్లుగా బంగారం, వెండి ధరలు పెరగడమే కానీ తరుగుదల లేదు. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన కొన్ని పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు నేల  చూపులు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో క్షీణత కనిపిస్తోంది. IBJA ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 దాకా తగ్గి రూ. 71963కు చేరింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా గురు, శుక్ర మూఢమి కారణంగా  వచ్చే ఆగష్టు వరకు వివాహాం, గృహ ప్రవేశాది ముహూర్తాలు లేవు. దీంతో బంగారం, వెండి కొనుగోలు తగ్గడంతో ఒక్కసారిగా రేట్లు దిగివచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ నెలలో వచ్చే అక్షయ తృతీయ రోజున బంగారం ధర కాస్త పెరిగే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు బంగారం మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 65918 ఉంది. వెండి (Silver) రేటు కూడా ఒక్కసారిగా పడిపోయింది. ఇది కిలోకు వెయ్యి రూపాయలకు పడిపోయింది.
 
ఈ రోజు దేశ వ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర.. తులం (10 గ్రాములు) రూ. 72,590 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 66, 540గా ఉంది. ఈ రోజు ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 83,400 మార్క్ టచ్ చేసింది. నిన్న హైరాబాద్‌లో వెండిధర రూ. 87,400 ఉండగా.. నేడు 86,900కి చేరింది. దాదాపు రూ. 500 రూపాయలు తగ్గింది.



ఇక గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈ రోజు జాతీయ స్థాయిలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,590. కాగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.66,540గా ఉంది. నేడు దేశంలోని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.83,400కి చేరింది. నిన్న హైదరాబాద్‌లో వెండి ధర 87,400 ఉండగా, నేడు రూ. 86,900కు చేరింది. దాదాపు 500 రూపాయలు తగ్గింది.


ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..


దేశ రాజధాని డిల్లీలో 10 గ్రాముల బంగారం ధర .. రూ. 72,740


హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర.. రూ. 72,590


చైన్నైలో 10 గ్రాముల బంగారం ధర.. రూ. 73,650


ముంబైలో బంగారం ధర.. రూ. 72,590


కోల్‌కతాలో బంగారం ధర.. రూ. 72.590


కేరళలో 10 గ్రాముల బంగారం ధర.. రూ. 72.590


బెంగళూరులో 10 గ్రాముల బంగారం ధర.. రూ. 72.590


Also read: Asaduddin Owaisi: ముస్లిం రిజర్వేషన్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook