Gold and Silver Rates Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి!!
March 19th 2022 Gold and Silver Rates In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,770గా ఉంది.
Gold and Silver Rates Today: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ ప్రారంభం అయ్యాక తులం బంగారం ధర ఆల్‌టైమ్ హైకి చేరుకుంది. ఓ సమయంలో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 53 వేలకు పైగా వెళ్లింది. అయితే 4-5 రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. గత రెండు రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. శనివారం (మార్చి 19) బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి.
ఈరోజు ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,770 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారం ధర నిలకడగా ఉండగా.. 24 క్యారెట్లపై రూ.10 మేర పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.69,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,770గా ఉంది. వాణిజ్య నగరం ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,770గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,220గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,600 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450.. 24 క్యారెట్ల ధర రూ.51,770గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,770గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,770గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,450.. 24 క్యారెట్ల ధర రూ.51,770గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,770 వద్ద కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,900లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.72,900లుగా కొనసాగుతోంది.
Also Read: Today Horoscope March 19 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి!!
Also Read: MS Dhoni: 'జెర్సీ నంబర్ 7' వెనకున్న రహస్యాన్ని బయటపెట్టిన ఎంఎస్ ధోనీ.. విషయమేంటో తెలిస్తే షాకే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook