Today Horoscope March 19 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి!!

March 19 2022, Daily Horoscope. వృషభం, కుంభ రాశుల వారికి ఈరోజు మిశ్రమ కాలం నడుస్తోంది.  ఈ రెండు రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 07:46 AM IST
  • March 19 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి
Today Horoscope March 19 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి!!

Today Horoscope March 19 2022: మేషం ( Aries): మీ పని తీరుకు ప్రశంసలు అందుతాయి. ఓ ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచి పేరు వస్తుంది. వ్యయం జరిగే సూచన ఉంది. బంధులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీదర్శనం ఉత్తమం.

వృషభం (Taurus): మిశ్రమ కాలం నడుస్తోంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. మీ పనితీరుతో అధికారులు సంతృప్తిగా ఉండకపోవచ్చు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

మిథునం (Gemini): ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కుటుంబంకు సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్సును ఇస్తుంది.

కర్కాటకం (Cancer): మీ మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు ఉన్నాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్యహృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

సింహం (Leo): అభివృద్ధికి సంబంధించిన మంచి శుభవార్త వింటారు. ఒక సంఘటన మిమ్మల్ని బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవ దర్శనం ఉత్తమం.

కన్య (Virgo): శుభ సమయం నడుస్తోంది. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనంద క్షణాలను గడుపుతారు.

తుల (Libra): ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ పనితో అందరి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. శివారాధన మంచిది.

వృశ్చికం (Scorpio): శుభకాలం నడుస్తోంది. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.

ధనస్సు (Sagittarius): ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమం.

మకరం (Capricorn): పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

కుంభం  (Aquarius): మిశ్రమ కాలం నడుస్తోంది. మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

మీనం (Pisces): ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ప్రయాణ సూచన ఉంది. ఇష్టదైవారాధన మంచిది.

Also Read: MS Dhoni: 'జెర్సీ నంబర్‌ 7' వెనకున్న రహస్యాన్ని బయటపెట్టిన ఎంఎస్ ధోనీ.. విషయమేంటో తెలిస్తే షాకే!!

Also Read: AAP in Telangana: తెలంగాణపై కన్నేసిన అరవింద్ కేజ్రీవాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News