Gold in India: దేశంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే 75 శాతం పెరిగాయి. దేశీయంగా బంగారానికి గిరాకీ పెరగడమే దిగుమతులకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్యశాఖ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం.. పసిడి, స్వర్ణం ఇలా ఏ పేరుతో పిలిచినా భారతీయులకు..  దానిపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో బంగారాన్ని లోహరూపంలో అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో చైనా, భారత్‌‌లే ముందువరుసలో ఉంటాయి. ఇంతకుముందుతో పోలిస్తే బంగారం ధరలు కొండెక్కిపోతున్నా.. కొనుగోలు చేయడానికి మాత్రం వెనకడగు వేయడంలేదు. దీంతో బంగారం దిగుమతులు పెరిగిపోతున్నాయి. అదేస్థాయిలో రోజురోజుకు పసిడి ధరలు ఆకాశన్నంటుతున్నాయి.


దేశంలో పసిడి దిగుమతులు ఊహించనివిధంగా పెరిగాయి. బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటు‌పై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. బంగారం దిగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు 73 శాతం పెరిగి 45.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అదే సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలో దిగుమతులు 26.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 2022లో బంగారం దిగుమతులు 11.45 శాతం క్షీణించి 4.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పసిడి దిగుమతులు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో కరెంట్ ఖాతా లోటు 176 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఈ లోటు 86 బిలియన్ డాలర్లుగా నమోదయింది. రానున్న పెళ్లిళ్ల సీజన్ కారణంగా దిగుమతులు మరింత పెరిగే అవకాశముందని, ఇది కరెంట్ ఖాతా లోటుపై మరింత ఒత్తిడి పెరగవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు.


ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి (Gold Import) చేసుకుంటున్న రెండో దేశం భారత్‌. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమలే ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. పైన తెలిపిన 9 నెలల వ్యవధిలో భారత్‌ 842.28 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అలాగే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి తొమ్మిది నెల‌ల్లో జెమ్స్‌, ఆభ‌ర‌ణాల ఎగుమ‌తులు గ‌ణ‌నీయ స్థాయిలో పెరిగాయి. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే 57.5 శాతం పెరిగి 35.25 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్నాయి. అయితే, సెప్టెంబ‌ర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారెంట్ ఖాతా లోటు 9.6 బిలియ‌న్ల డాల‌ర్లు అంటే 1.3 శాతం ప‌డిపోయాయ‌ని ఆర్బీఐ చెబుతోంది.


Also read: Upcoming smartphones: ఈ నెలలో విడుదలవనున్న 5 స్మార్ట్​ఫోన్లు ఇవే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook