Gold Silver All Time High: బంగారం-వెండి ధరలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. అయితే ఇన్వెస్టర్లకు మాత్రం ఈ ఏడాది కాలంలో భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే పసిడి ప్రియులకు ఈ వార్త నిజంగా శుభవార్తే అని చెప్పాలి. పెరుగుట విరుగుట అనే సామేత తెలిసిందే కదా. బంగారం-వెండి ధరలు రికార్డులు క్రియేట్ చేస్తే..రానున్న రోజుల్లో ఒక్క రోజే దాదాపు 20శాతం వరకు పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ర్యాలీ ఎంత వేగంగా ఉందో.. అంతే వేగంగా దిగజారుతుందని అంటున్నారు.
Copper Prices Rising: 2025లో బంగారం, వెండి లోహాలు పెట్టుబడిదారులకు అద్భుతమైన లాభాలు ఇచ్చాయి. అయితే ఇప్పుడు బంగారం, వెండితోపాటు మార్కెట్ నిపుణుల దృష్టి మరో లోహంపై పడింది. అదే రాగి. మారుతున్న సాంకేతిక ప్రపంచం, గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ వంటి అంశాలు రాగిని రానున్న సంవత్సరాల్లో కీలక పెట్టుబడి సాధనంగా మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Artificial Gold Making: ఈ ఏడాది బంగారం విపరీతంగా పెరిగిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా..ఈ ఏడాది భారీగా పెరిగిపోయింది. దీని కారణంగా సాధారణ మానవుడికి బంగారం కొనుగోలు ఓ కలగానే మారింది. అయితే బంగారం ఇంట్లోనే తయారు చేయోచ్చని చాలామందికి తెలియని విషయం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Money Saving Tips: మహిళలు ఆర్థిక నిర్ణయాలలో తీసుకోవడం ముందంజలో ఉంటున్నారు. ఇంటి ఖర్చులు, పెట్టుబడులు, భవిష్యత్ ప్రణాళికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లు, బంగారం, బీమా వంటి రంగాల్లో మహిళల పెట్టుబడులు పెరుగుతున్నాయి. కుటుంబ భద్రతను ప్రాముఖ్యతగా భావిస్తూ.. ఆర్థిక నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నారు. అందుకే అంటారేమో ఇంటికి దీపం ఇల్లాలే అని. మహిళ తలచుకుంటే నెలకు 20 సంపాదించే భర్త అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటాడని సర్వేలు సైతం రుజువు చేస్తున్నాయి.
Gold -Silver Rate Fall : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. 10గ్రాముల బంగారం ధర రూ. 3,900 తగ్గింది. దీంతో రూ. 1,25,800 చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పతనం అయ్యింది. కిలోకు రూ. 7,800 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,56,00 పలుకుతోంది. అయితే రానున్న రోజుల్లో అంటే డిసెంబర్ నెల చివరి కల్లా పది గ్రాముల బంగారం ధర తులం రూ. 1లక్షకు దిగి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Gold Reserves In World: భారతీయ మహిళలకు ఇష్టమైన 'బంగారం' రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మారుతున్న కాలంలో, బంగారాన్ని ఉత్తమ పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. కానీ, ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ బంగారం ఉంది? అత్యధిక బంగారం ఉన్న దేశాలలో భారతదేశం ఎక్కడ ఉందో ఇక్కడ కొన్ని ముఖ్యమైన సమాచారం ఉంది.
Cheapest Gold Country: దుబాయ్ లో చాలా తక్కువ ధరకే బంగారం లభిస్తుందని చాలా మంది చెబుతుంటారు. కానీ దుబాయ్ కంటే తక్కువ ధరకే ఈ చిన్న దేశంలో లభిస్తుందని మీకు తెలుసా. అది కూడా భారత్ కు పొరుగున ఉన్న దేశంలోనే. ఆశ్చర్యంగా ఉందా. అయితే ఈ స్టోరీ చదవండి.
Gold In Dream Meaning: ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు వస్తుంటాయి. కానీ కొంతమందికి మాత్రమే కలలో కనిపించే వాటి గురించి అర్థం తెలుస్తుంది. ఇప్పుడు మీరు కలలో బంగారం కనిపిస్తే దాని అర్థం ఏమిటి? అది శుభమా.. లేదా అశుభమా అని ఇక్కడ తెలుసుకుందాం..
Uppada Beach Gold Rush: ఇటీవలే అల్లకల్లోలం సృష్టించిన మొంథా తుపాను తర్వాత ఏపీలోని కాకినాడ జిల్లాలో ఉప్పాడ బీచ్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతింది. కానీ తుఫాను ఇప్పుడు ఉప్పాడ బీచ్‌కు బంగారాన్ని తెచ్చిపెట్టిందనే వార్త వైరల్‌గా మారింది. దీనితో స్థానికులందరూ ఉప్పాడ బీచ్‌కు తరలివచ్చారు.
బంగారం ధరలు మళ్లీ భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,140 తగ్గి రూ.1,24,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,050 తగ్గి.. రూ.1,14,110 కు చేరుకుంది. అయితే రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయా? తగ్గుతాయా? అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Gold: భూమిపై వాణిజ్య విలువ పరంగా అత్యంత ప్రాధాన్యం పొందిన లోహం బంగారమే అని చెప్పవచ్చు. మనిషి నాగరికత పుట్టుకనుంచీ బంగారం సంపదకు, శక్తికి, ప్రతిష్ఠకు ప్రతీకగా నిలిచింది. ఒకప్పుడు ప్లాటినం.. బంగారం కంటే ఎక్కువ విలువైనదిగా ఉండేది. కానీ కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం బంగారం.. ప్లాటినం కన్నా దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ విలువైందిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు భూమి లోపల నుంచి వెలికి తీసిన మొత్తం బంగారం సుమారు 2,10,000 టన్నులుగా ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. ఇది మానవ చరిత్రలో వెలికితీసిన బంగారంలోనే అత్యధిక పరిమాణం ఇది.
Gold In Trees: డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఈ సామేత చాలా ఫేమస్. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. బంగారం మాత్రం చెట్లకు కాస్తోంది. అవును మీరు చదివింది నిజమే. ఆ దేశంలో బంగారం చెట్లకు కాస్తోంది. చెట్లకు బంగారంతో సహజ సంబంధం ఉందని శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించారు. ఏ దేశంలో చెట్లకు బంగారం కాస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Gold Rate Today: పండుగ సీజన్‌లో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల పెరుగుతూ వచ్చిన పసిడి, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా భారీగా కుప్పకూలాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) కారణంగా గోల్డ్ రేట్లు క్షీణించాయని నిపుణులు చెబుతున్నారు.
Gold Rate Donald Trump Tariffs: అక్టోబర్ 11 నాటికి బంగారం ధర గ్రాముకు రూ.1.25 లక్షలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ, రాజకీయ అంశాల కారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈలోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్ల ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
Gold Investment: మన దేశంలో మహిళలకు అత్యంత ఇష్టమైన రెండు విషయాలు ఉంటే ఏంటంటే..ఒకటి చీరలు కొనడం.. రెండు బంగారం కొనడం. పండగ అయినా, పబ్బం అయినా. పెళ్లి అయినా, శుభకార్యం జరిగినా మహిళలు కొత్త చీరలు, ఆభరణాలు కొనడంలో ముందుంటారు. మహిళలు షాపింగ్ చేస్తుంటే ఇంకా కొంటారు..కొన్నది చాలు అని విసుక్కుంటారు. ముఖ్యంగా బంగారం కొనుగోలు చేస్తుంటే..పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా లేదా బంగారం ఐదు పది రూపాయలు ఏమైనా ఉందా అని గొడవపడే వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ మోజే చాలా కుటుంబాలకు వరమైంది అనిపిస్తోంది. భార్యలు కొనుగోలు చేసిన బంగారం ఇప్పుడు భర్తలను కోటీశ్వరులుగా మార్చేసింది.
Treasure: సముద్ర గర్భంలో మూడు శతాబ్దాల క్రితం మునిగిపోయిన ఓ నౌక.. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. 310 ఏళ్ల క్రితం అనగా 1715, జూలై 31న భారీ తుఫాన్ కారణంగా సముద్రంలో నౌక మునిగింది. తాజాగా ఈ నౌక అవశేషాలను గుర్తించగా.. అందులో మైండ్ బ్లాక్ అయ్యే ఖజానా బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
RBI Gold Loan Guidelines: బంగారం, వెండి కొనుగోలుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల కొన్ని కొత్త నియమాలను తీసుకువచ్చింది. ఇవి అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. బంగారం, వెండి కొనాలనుకునేవారు లేదా రుణాలు తీసుకోవాలనుకునే వారు ఈ కొత్త నియమాల గురించి తప్పక తెలుసుకోవాలి.
Indian Culture: భారతదేశంలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాకుండా శుభప్రదం, సంప్రదాయం, పెట్టుబడి ప్రతీకగా భాస్తుంటారు. వివాహాలు, పండుగలు బంగారం లేకుండా పూర్తికావు. ప్రస్తుతం భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 25,000 టన్నుల బంగారం ఉందని అంచనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నిల్వ అని చెబుతున్నారు. చైనా తర్వాత భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి మధ్య బంగారం భద్రమైన పెట్టుబడిగా నిలుస్తోంది.
Gold and Diamond Jewellery Offers 2025: బంగారం భారీగా పెరిగింది. 10 గ్రాముల పసిడి లక్షన్నరకు చేరువయ్యింది. సామాన్యులు బంగారం కొనాలంటేనే భయపడాల్సిన పరిస్ధితి నెలకొంది. అయితే దసరా నవరాత్రుల్లో చాలా మందికి బంగారం కొనుగోలు చేయడం ఒక సెంటిమెంట్ గా ఉంటుంది. ఎంత ధర ఉన్నా కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనాలని ప్లాన్ చేస్తారు. మీరు కూడా ఈ దసరా నవరాత్రుల్లో బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో బంపరాఫర్ ఉంది. అనేక బ్రాండ్లు బంగారు ఆభరణాలపై డిస్కౌంట్లు ప్రకటించాయి. వజ్రాభరణాలపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Today Gold Rate : పసిడి ప్రియులకు ఊపిరిపీల్చుకునే వార్త. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత రెండు రోజులు బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు సెప్టెంబర్ 19వ తేదీ శుక్రవారం నాడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.