Gold Price Today January 7 2022 : బంగారమంటే ఆడవాళ్లు పడిచస్తారనడంలో అతిశయోక్తి లేదేమో. ఒంటి నిండా బంగారు నగలు దిగేసుకుంటే వారి ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు. గతంలో బంగారాన్ని కేవలం అలంకరణ వస్తువుగానే ఎక్కువగా చూసేవారు. కానీ ఇప్పుడు అది కూడా ఒక పెట్టుబడి మార్గంగా మారిపోయింది. దీంతో బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల దాకా బంగారం ధరలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. ధర కాస్త తగ్గిందని తెలిస్తే చాలు బంగారం కొనేందుకు రెడీ అయిపోతారు. ఈ నేపథ్యంలో ఇవాళ దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: 


హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.200 మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,040గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.210 మేర ధర తగ్గింది.


విజయవాడలోనూ ఇంచుమించుగా హైదరాబాద్‌లో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. విజయవాడలో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.200 మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,040గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.210 మేర ధర తగ్గింది.


దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,400గా ఉంది.


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,830
ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,830గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230గా ఉంది. 


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,750గా ఉంది.


 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040గా ఉంది.


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990గా ఉంది.


Also Read: Mahesh Babu tested Corona Positive: మహేశ్​ బాబుకు కరోనా పాజిటివ్​- స్వయంగా వెల్లడి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి